https://oktelugu.com/

ఆర్జీవీ ‘మిస్సింగ్’ గోడు ఎవరికీ పట్టడం లేదా?

ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు అన్నచందంగా రాంగోపాల్ వర్మ పరిస్థితి మారింది. ఒకప్పుడు తెలుగునాట ‘శివ’ సినిమాతో సంచలన సృష్టించిన దర్శకుడు ఆర్జీవీ. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ దర్శకుడు టాలీవుడ్ వదిలి బాలీవుడ్ వెళ్లాడు. అక్క కొద్దిరోజులు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఆర్జీవీ సినిమాలన్నీ వరుస ప్లాపులు చవిచూడాల్సి వచ్చింది. దీంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీకి చేరుకొని ఇక్కడ సినిమాలు తీయడం ప్రారంభించాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 03:50 PM IST
    Follow us on

    ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు అన్నచందంగా రాంగోపాల్ వర్మ పరిస్థితి మారింది. ఒకప్పుడు తెలుగునాట ‘శివ’ సినిమాతో సంచలన సృష్టించిన దర్శకుడు ఆర్జీవీ. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ దర్శకుడు టాలీవుడ్ వదిలి బాలీవుడ్ వెళ్లాడు. అక్క కొద్దిరోజులు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఆర్జీవీ సినిమాలన్నీ వరుస ప్లాపులు చవిచూడాల్సి వచ్చింది.

    దీంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీకి చేరుకొని ఇక్కడ సినిమాలు తీయడం ప్రారంభించాడు. టాలీవుడ్లో రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలన్నీ వివాదస్పద కథలే కావడం విశేషం. కేవలం కాంట్రవర్సీటీలతో సినిమా పబ్లిసిటి చేసుకోవడం ఆర్జీవీకి అలవాటుగా మారింది. ఇటీవల కాలంలో ఆర్జీవీ తెరకెక్కించిన ఏ సినిమాకు ఆయన మంచి విజయాన్ని ఇవ్వలేదు. అలా అని ఆయన పెద్దనష్టాలు కూడా ఏమీ రాలేదు. అయితే కరోనాతో షూటింగులన్నీ బంద్ ఆర్జీవీ మాత్రం వరుస సినిమాలు తీస్తూ లాభాలు గడించాడు.

    Also Read: గంగవ్వను టార్గెట్ చేస్తున్న కంటెస్టెంట్లు.. గేమ్ రసవత్తరంగా మారనుందా?

    అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.. కరోనా కాలంలో ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా షార్ట్ ఫిలింలను తలపించాయి. ట్రైలర్.. ఫస్టులుక్.. టీజర్ అంటూ తన సినిమాలపై ఆర్జీవీ హడావుడి చేసి ప్రేక్షకులను డబ్బులు దండుకొని వాళ్లను పిచ్చొళ్లను చేశాడు. ఆర్జీవీ చూపించే ట్రైలర్.. ప్రమోషన్ కి సినిమాలకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదని టాక్ ఉంది. దీంతో ఇటీవల కాలంలో ఆయన సినిమాలపై ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు.

    ఒకప్పుడు ఆర్జీవీ ఒక్క ట్వీట్ చేస్తే అది సంచలనంగా మారేది. అయితే ప్రస్తుతం సీన్ మారినట్లు కన్పిస్తోంది. ఇటీవల వర్మ తెరకెక్కించిన ‘పవర్ స్టార్’ విషయంలోనూ ఈ హడావుడి కన్పించింది. అయితే తాజాగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ పేరిట తెరకెక్కిస్తున్నసినిమాను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్జీవీ మిస్సింగ్ పేరుతో వరుసగా పీకే ఫ్యాన్స్.. మెగా ఫ్యామిలీ.. మాజీ సీఎం.. అతడి కుమారుడు.. పోస్టర్లను రిలీజ్ చేశాడు. అయితే వీటిని మెగా ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. దీంతో ఈ మూవీకి రావాల్సినంత పబ్లిసిటీ రావడం లేదని తెలుస్తోంది.

    Also Read: ఆ ఛానల్ అంతు చూసేందుకు రెడీ అవుతున్న రియా చక్రవర్తి?

    కాంట్రవర్సిలతో ఆర్జీవీ పబ్బం గడుపుకుంటాడని అర్థం చేసుకున్న అభిమానులంతా అతడి పట్టించుకోవడం మానేశాడు. ఆర్జీవీ చూపించే ట్రైలర్ కు సినిమాకు పెద్దతేడా ఉండదని ఆర్జీవీ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆర్జీవీ ‘మిస్సింగ్’పై జనాల్లో పెద్దగా స్పందన రాకపోవడం లేదు. ఇదంతా చూస్తుంటే జనాలు ఆర్జీవీ అంతేనని వదిలేశారా అన్న అనుమానాలు కలుగక మానడు. ఇది ఇలానే కొనసాగితే ఆర్జీవీ పప్పులు ఇక ఉడకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.