Site icon OkTelugu

Pawan Kalyan And Ali: పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఆ నటుడితో మాట్లాడటం లేదా..? ఇంతకీ ఏం జరిగిందంటే..?

Pawan Kalyan And Ali

Pawan Kalyan And Ali

Pawan Kalyan And Ali: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైతే ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడం ఆయన కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు…అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. తన అభిమానులు సైతం అతని సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. గత సంవత్సరం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే సినిమాలను చేస్తూనే తన అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటులతో మాట్లాడటం లేదనే వార్తలు వైరలవుతున్నాయి. బేసిగ్గా పవన్ కళ్యాణ్ ఎవరితో గొడవ పెట్టుకోడు. ప్రొఫెషన్ పరంగా మాత్రం ఆయన ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉంటాడు.

ఇలాంటి నటుడు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అలీ వైసీపీ పార్టీలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ దూషిస్తూ కొన్ని మాటలు మాట్లాడడంతో ప్రస్తుతం ఇప్పటికీ అతనితో పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదట. ఒకవేళ అలీ కనక పవన్ కళ్యాణ్ తోనే ఉండుంటే ఇప్పుడు అలీ చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. పాలిటిక్స్ లో కూడా తను రాణించే అవకాశమైతే ఉండేది.

కానీ అలా కాకుండా వైసీపీ పార్టీ లోకి వెళ్లి తప్పు పని చేశారని చాలామంది అతన్ని విమర్శిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆత్మీయుడైన అలీ వేరే పార్టీలో చేరడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు. అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అలీతో మాట్లాడడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి…

Exit mobile version