Site icon OkTelugu

India Vs Usa T20 World Cup: అమెరికా పకడ్బందీ ప్రణాళిక.. బిత్తర పోయిన అభిషేక్ శర్మ, శివం దుబే

India Vs Usa t20 World Cup

India Vs Usa t20 World Cup

India Vs Usa T20 World Cup: ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శివం దుబే సత్తా చూపించాడు. వీరిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో అదరగొడతారని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇద్దరు సున్నా పరుగులకు ఔట్ అయ్యారు.

అభిషేక్ శర్మ ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అటువంటి ఆటగాడు తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కావడం సంచలనం కలిగించింది. వాస్తవానికి ఏ జట్టు కూడా తొలి ఓవర్లలో ఎక్స్ ట్రా డీప్ కవర్ లో ఫీల్డర్ ను పెట్టదు. కానీ అమెరికా కావాలని ఆస్థానంలో ఫీల్డర్ ను పెట్టింది. దీంతో అభిషేక్ శర్మ వాన్ షాక్ విక్ బౌలింగ్ లో తొలి బంతికే అవుట్ అయ్యాడు.

అభిషేక్ శర్మ అలా అవుట్ కావడంతో టీమిండియాలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడిపోయాయి. ఈ దశలో అభిషేక్ శర్మ ఉదంతాన్ని పాఠంగా తీసుకోవలసిన శివం దుబే లాంటి ఆటగాడు కూడా అలానే అవుట్ కావడం దిగ్బ్రాంతి కలిగించింది. శివం దుబే ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడు అందరికీ తెలుసు
అందువల్లే అమెరికా పకడ్బందీ ప్రణాళికతో అతడిని కూడా ఔట్ చేసింది. వాస్తవానికి టి20 ఫార్మాట్ లో ఆటగాళ్లు ముందుగా బంతులను పరీక్షించుకుంటారు. ఆ తర్వాత దూకుడు మొదలుపెడతారు. కానీ అమెరికా మీద భారత బ్యాటర్లు అలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా అమెరికా బౌలర్లు పై చేయి సాధిస్తున్న సమయంలో.. వారి ఎత్తులకు తలవంచారు. తద్వారా టీమిండియా ప్రమాదకరమైన ప్లేయర్లు అభిషేక్ శర్మ, శివం దుబే లాంటి ప్లేయర్లు 0 పరుగులకు అవుట్ అయ్యారు.

శివం దుబే, అభిషేక్ శర్మ మాత్రమే కాదు.. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్యా(5) ఒంటి ప్లేయర్లు కూడా సింగల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. అక్షర్ పటేల్ (14) కూడా అమెరికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు. తద్వారా టీమిండియా అంచనాలకు మించి స్కోర్ చేయలేకపోయింది. సూర్య కుమార్ యాదవ్ (84*) అదరగొట్టడంతో టీమిండియా అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. భారత జట్టు 161 పరుగులు చేస్తే.. అందులో సూర్యకుమార్ యాదవ్ చేసినవే 84 పరుగులు ఉన్నాయంటే.. అతని బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version