Site icon OkTelugu

India US Trade Deal: కశ్మీర్ భారత్‌దే.. పాక్‌కు ట్రంప్‌ షాక్‌..!

India US Trade Deal

India US Trade Deal

India US Trade Deal: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన 2.0 పాలనలో ఏడాదికాలంగా భారత్‌పై విద్వేషం వెల్లగక్కారు. తన వ్యక్తిగత అవసరాల కోసం పాకిస్తాన్‌తో దోస్తీ చేసి.. భారత్‌పై, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేశారు. భారత ఎగుమతులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా భారత్‌పై రెచ్చిపోయారు. ఇక టారిఫ్‌ల ప్రభావంతో దీంతో భారత్‌లోని ఫార్మసీ, అపరెల్స్‌, టెక్సటైల్స్‌ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ట్రంప్‌ టారిఫ్‌లపై, వ్యాఖ్యలపై మోదీ మౌనం వహించారు. తన చాణ్యంతో ఆస్ట్రేలియా, యూకే, యూఏఈ, దుబాయ్‌, దక్షిణాఫ్రికాతోపాటు యూఏఈతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో ట్రంప్‌ దిమ్మ తిరిగింది. వెంటనే భారత్‌తో వాణిజ్య ఒపపందానికి ముందుకు వచ్చారు. మధ్యంతర ఒప్పందం కుదిరింది కూడా. ఇక పాకిస్తాన్‌తో దోస్తీ తప్పని అర్థం చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చేలా ఓ పోస్టు పెట్టారు.

ట్రేడ్ డీల్ సందర్భంగా స్పష్టమైన సందేశం..
భారత-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. తర్వాత కొన్ని గంటల్లోనే అమెరికా అధికారిక ‘X’ ఖాతాలో భారత మ్యాప్ పోస్ట్ చేసింది. ఈ మ్యాప్‌లో జమ్మూ-కశ్మీర్, లడఖ్, పీవోకే(పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) అన్నీ భారత భూభాగంగా చూపారు. ఇది భారత సరిహద్దులకు అమెరికా అంగీకారాన్ని సూచిస్తుంది.

పాక్ వాదనకు తీవ్ర దెబ్బ..
ఈ పోస్ట్ పాకిస్తాన్ ‘కశ్మీర్ మీద మాకు హక్కు’ అనే దీర్ఘకాల వాదనను స్పష్టంగా తిరస్కరించింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిన సమయంలోనే ఈ చర్య, రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని ప్రపంచానికి చాటింది. పాకిస్తాన్ ఆశలు, అహంకారం ఒకేసారి కుప్పకూలాయి.

ఈ సంఘటన భారత-అమెరికా మధ్య ఆధయంగా బలపడిన బంధాలను, పాకిస్తాన్‌పై అమెరికా పరిమిత మద్దతును స్పష్టం చేసింది. భారత భౌగోళిక సమగ్రతకు అంతర్జాతీయ ఆమోదం బలపడింది. పాకిస్తాన్ ఈ దెబ్బ నుంచి కోలుకోవడం ఇప్పట్లో కష్టమే.

Exit mobile version