Site icon OkTelugu

India Vs Usa t20 World Cup: 161 కాదు.. ఇంతకంటే తక్కువ స్కోర్లు నమోదైనా టీమిండియా గెలిచింది!

India Vs Usa t20 World Cup

India Vs Usa t20 World Cup

India Vs Usa t20 World Cup: టి20 వరల్డ్ కప్ లో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 161 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ విశ్వరూపం చూపించాడు. 84 పరుగులు చేశాడు. తద్వారా తను ఎలాంటి ఆటగాడినో మరోసారి ప్రత్యర్థులకు చూపించాడు.

వాస్తవానికి ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శివం దుబే, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లు 0 పరుగులకు అవుట్ అయ్యారు. చివర్ల వరుణ్ చక్రవర్తి సున్నా పరుగులకే రన్ అవుట్ అయ్యాడు. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) సింగిల్ డిజిట్ స్కోర్ కు ఔట్ అయ్యారు.

8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. 45 పరుగుల వద్ద రెండో వికెట్.. 46 పరుగుల వద్ద మూడో వికెట్.. అదే స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసే వరకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. 77 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. 118 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఇక ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ ప్రతాపం చూపించాడు.

సూర్య కుమార్ యాదవ్ దూకుడు వల్ల టీమిండియా 161 పరుగులు చేసింది. అయితే టీమిండియా టి20 వరల్డ్ కప్ లో ఇంతకంటే తక్కువ పరుగులు చేసినప్పుడు కూడా మ్యాచ్ లను నిలబెట్టుకుంది. 2024 లో 119 పరుగులు చేసినప్పటికీ.. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. 2016లో బంగ్లాదేశ్ జట్టుపై 146 పరుగులు చేసినప్పటికీ భారత్ ఆ మ్యాచ్ నిలుపుకుంది. 2012లో సౌత్ ఆఫ్రికా మీద 152 పరుగులు చేసినప్పటికీ.. ఆ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిచింది. 2007లో సౌత్ ఆఫ్రికా మీద 153 పరుగులు చేసినప్పటికీ.. ఆ మ్యాచ్ గెలిచింది. 2007లో మళ్లీ అదే సౌత్ ఆఫ్రికా పై 157 పరుగులు చేసినప్పటికీ భారత్ విజయం సాధించింది.

ప్రస్తుతం సొంత మైదానంలో టీమిండియా ఆడుతున్న నేపథ్యంలో.. తక్కువ స్కోరు నమోదు చేసిన మ్యాచ్లో కూడా విజయం సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే టీమిండియాలో సమర్థవంతమైన బౌలర్లు ఉన్నారు. అందువల్లే అభిమానులు భారత్ విజయం సాధిస్తుందని ధీమాతో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో టీమిండియా గెలుపు పై అభిమానులకు భారీగానే అంచనాలు ఉన్నాయి.

Exit mobile version