Teenmar Mallanna- Puvvada: క్యూ న్యూస్ నిర్వాహకుడు, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై తెలంగాణ రోడ్లు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. టీఆర్ఎస్ పార్టీకి తన ప్రతిష్టకు భంగం కలిగించారనే అభియోగంపై మల్లన్న పరువు నష్టం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మంత్రి వెల్లడించారు. చానల్ ఉందనే ధీమాతో తమపై అనవసరంగా అవినీతి ఆరోపణలు ఆపాదిస్తూ తమ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని వాపోయారు.
జర్నలిస్ట్ ముసుగులో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపించారు. అసత్య ఆరోపణలు చేస్తూ తమ పలుకుబడిని తగ్గిస్తున్నారని చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న చెబుతున్న వాటికి ఆధారాలు లేవన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నందుకు ఆయనపై క్రిమినల్, సివిల్ కేసుల ద్వారా రూ. 10 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న ఏవో దురుద్దేశాలతో తమ ప్రతిష్ట దెబ్బతీయడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Star Hero: డెడ్ చీప్ అయిపోయిన హీరో.. గుర్తుపట్టగలరా ?
మంత్రిపై క్యూ న్యూస్ లో ఎన్నో రకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ప్రసారం చేస్తున్న వాటిలో నిజం లేకపోవడంతో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీన్మార్ మల్లన్న తప్పుడు సంకేతాలతో ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ ముసుగులో ఆయన చేస్తున్న వాటిలో నిజం లేదని అన్నారు.
తీన్మార్ మల్లన్న నిరాధారమైన ఆరోపణలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మంత్రి అజయ్ కుమార్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు చేస్తూ తమ చానల్ కు రేటింగ్ పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే పరువు నష్టం నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై మల్లన్న ఎలా స్పందిస్తార్ తెలియడం లేదు. నోటీసుకు సమాధానమే చెబుతారో తిరిగి ఏం చేస్తారోననే సంశయాలు వస్తున్నాయి.
Also Read:Actress Suicide: ప్రేమ.. ప్రియుడితో సహజీవనం.. నటి ఆత్మహత్యకు ఇదే కారణమా?