Rajya Sabha: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. రాబోయే ఎన్నికలను అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి రైతు డిక్లరేషన్ ఇప్పించింది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఏ కార్యక్రమం చేపట్టలేదు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ బయటకు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఎటు వైపు వెళ్తుందనే అనుమానాలు వస్తున్నాయి.
మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించిన సూచనలు, సలహాలతో టీఆర్ఎస్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. కానీ ఎన్నికల కోసం మాత్రం తన దృష్టి కేంద్రీకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేథ్యంలో టీఆర్ఎస్ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటనే దానిపై తర్జనభర్జన జరుగుతోంది. టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతున్నా అధినేత కేసీఆర్ మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు.
Also Read: Teenmar Mallanna- Puvvada: తీన్మార్ మల్లన్న రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్న మంత్రి
రాజ్యసభ సభ్యుల సభ్యత్వం కోసం సభ్యుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఈనెల 31 గడువు ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. కేసీఆర్ నిర్ణయాలు వైవిధ్యంగా ఉంటాయనడంలో సందేహం లేదు. పార్టీ కోసం పని చేసే వారికి ఇస్తారో లేక తాను అనుకున్న వారికి కేటాయిస్తారో తెలియడం లేదు. ఈ క్రమంలో రాజ్యసభ కోసం చాలా మంది క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ సీట్లలో ఒకటి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. మరో రెండు సీట్లలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, మహబూబాబాద్ మాజీ ఎంపీపీ సీతారాం నాయక్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు కవిత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఆమెకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఆశ్చర్యపోనక్కరలేదని తెలుస్తోంది.
Also Read: World In 2070: 2070వ సంవత్సరంలో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది?
మొత్తానికి కేసీఆర్ బయటకు రావడానికి 16 రోజులు పట్టింది. దీంతో తన వీలును బట్టి ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏం కౌంటర్ ఇస్తారోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .ఇన్నాళ్లు రెండు పార్టీలు టీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన క్రమంలో కేసీఆర్ ఏం మాట్లాడతారోనని అందరు ఆతృతగా ఉన్నారు. రేపు జరిగే పీకేతో్ భేటీలో ఏ విషయాలు చర్చిస్తారో అని అందరు భావిస్తున్నారు.