Site icon OkTelugu

Nalgonda Husband And Wife: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడు?

Nalgonda Husband And Wife:  పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించింది. పెళ్లయిన తరువాత ప్రియుడే కావాలంది. దీంతో మళ్లీ భర్తకు ఫోన్ చేసి రమ్మంది. ఈ నేపథ్యంలో భర్తకు అనుమానం వచ్చి ఆమెను అంతం చేశాడు. భార్య చేసిన మోసాన్ని జీర్ణించుకోలేని భర్త చేసిన ఘాతుకానికి బలైంది. నూరేళ్లు హాయిగా ఉండాల్సిన కాపురంలో చిచ్చు రేపుకుంది. ముక్కోణపు ప్రేమకథలో చివరకు ఆమే సమిధగా మిగిలింది. భర్త కోపానికి తన ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండలోని పున్నమి లాడ్జిలో జరిగిన ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Nalgonda Husband And Wife

నల్లగొండ జిల్లా చౌకత్పల్లి గ్రామానికి చెందిన మురావత్ శంకర్ ప్రేమించి రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి సంసారంలో అల మొదలైంది లొల్లి. ఏప్రిల్ 11న ఉగాది కావడంతో భార్యను పుట్టింటికి పంపించాడు భర్త శంకర్. వివాహానికి ముందే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. పుట్టింటికి వెళ్లిన తరువాత ఇద్దరు కలుసుకుని ఇల్లు విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని తీసుకొచ్చినా తాను సురేష్ తోనే వెళతానని సరిత చెప్పడంతో ఇక ఏం చేయలేని స్థితిలో శంకర్ తన ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడే పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

Also Read: Actress Suicide: ప్రేమ.. ప్రియుడితో సహజీవనం.. నటి ఆత్మహత్యకు ఇదే కారణమా?

కొన్నాళ్లకు సరిత మళ్లీ శంకర్ కు ఫోన్ చేసి తాను నీతోనే ఉంటానని చెప్పడంతో అతడు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకొస్తున్నాడు. అయితే నల్లగొండకు వచ్చేసరికి బస్సులు లేకపోవడంతో అక్కడే పున్నమి లాడ్జిల్ గది అద్దెకు తీసుకుని ఉన్నారు. తెల్లవారు జామున ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగడంతో సరితను శంకర్ చున్నీతో ఉరివేసి చంపాడు అనంతరం లాడ్జి నుంచి పారిపోయాడు.

Nalgonda Husband And Wife

దీంతో పోలీసులు శంకర్ పై కేసు నమోదు చేశారు. మునుగోడు వెళ్లేందుకు బస్టాండ్ లో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శంకర్ నేరం ఒప్పుకోవడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఎక్కడ తన మాజీ ప్రియుడితో వెళ్తుందోననే భయంతోనే తానీ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

Also Read:Acharya Closing Collections: క్లోజింగ్ కలెక్షన్స్.. మొత్తం 87.13 కోట్లు నష్టం

Exit mobile version