https://oktelugu.com/

జిల్లాకో సలహా, నియోజకవర్గానికో డిమాండ్!

ఏపీలో నియోజవర్గాలను జిల్లాలుగా మార్చడానికి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇంతలోనే సీఎం జగన్ కి జిల్లాకో సలహా, నియోజకవర్గానికో డిమాండ్ ల ప్రక్రియ ప్రారంభమయ్యాయి.. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రాధమికంగా కొన్ని ప్రకటనలు మాత్రమే వచ్చాయి. చూచాయగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో పార్లమెంట్ నియోజక వర్గాలను జిల్లాలుగా మారుస్తామన్నారు. ఇది పట్టుకొని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు కొంత మంది హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 10:21 am
    Follow us on

    ఏపీలో నియోజవర్గాలను జిల్లాలుగా మార్చడానికి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇంతలోనే సీఎం జగన్ కి జిల్లాకో సలహా, నియోజకవర్గానికో డిమాండ్ ల ప్రక్రియ ప్రారంభమయ్యాయి.. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రాధమికంగా కొన్ని ప్రకటనలు మాత్రమే వచ్చాయి. చూచాయగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో పార్లమెంట్ నియోజక వర్గాలను జిల్లాలుగా మారుస్తామన్నారు. ఇది పట్టుకొని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు కొంత మంది హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల డిమాండ్ లు కొన్ని పుట్టుకొస్తున్నాయి. పాత జిల్లాలను విభజించవద్దని డిమాండ్ లు పుట్టుకొస్తున్నాయి. ఇవి చిలికి చిలికి వివాదాస్పదం గా మరే అవకాశాలు ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త జిల్లాల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఒక సూచన చేశారు.

    2026 లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దులు మారిపోతాయి. అంటే అప్పటికి జిల్లాల విభజన పూర్తి అయితే ఆ నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా జిల్లాలను మారుస్తారా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇది నిజానికి జగన్ ఆలోచించాల్సిన విషయమే. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలని అనుకునే ఆలోచననే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మేధావి వర్గం కావచ్చు, ఐఎఎస్ వర్గం కావచ్చు, రాజకీయ నాయకుల్లో సీనియర్లు కూడా పార్లమెంటు ను జిల్లాగా చేయడం ఏ మాత్రం అంగీకరించడం లేదు. పార్లమెంటు స్థానం అనేది కేవలం ఎన్నికలు, ఓటర్ల దృష్టిలో పెట్టుకుని చేసింది. ఓటర్లు ఓట్లు వేయాలంటే పార్లమెంటు స్థానం కేంద్రానికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎవరు ఎవరి ఊళ్ళో పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు చేసుకోవచ్చు. కానీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా గా మార్చడం వలన నియోజకవర్గ కేంద్రం అంటే జిల్లా కేంద్రానికి ప్రజలు తరచు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దూరాభారం ఎక్కువగా ఉంటుంది. అరకు పార్లమెంట్ ను తీసుకుంటే ఈ పార్లమెంట్ పరిధిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి మొదలుకొని విజయనగరం, శ్రీకాకుళం తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 250 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దాన్ని జిల్లాగా మారిస్తే ఈ 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి రావడం కంటే హైదరాబాద్ వెళ్లి రావడం నయం అన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అలాగే ప్రకాశం జిల్లా లోనూ, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే సి ఎం జగన్ దీనిపై పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని నాయకులు నుంచి కూడా జిల్లాల విషయంలో కొన్ని సూచనలు భిన్న వాదనలు వస్తున్నాయి.

    తాజాగా స్పీకర్ తమ్మినేని కూడా ఈ విషయంపై స్పందించారు. శ్రీకాకుళం జిల్లాను అసలు విభజించాల్సిన అవసరం లేదని తమ్మినేని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల కిందట శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా తమ్మినేని కూడా శ్రీకాకుళం జిల్లాను విధించాల్సిన అవసరం లేదంటూ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఈ రెండు విస్తీర్ణం పరంగా కూడా చిన్న జిల్లాలు. వీటిని విభజిస్తే సాంకేతికంగా జిల్లా కేంద్రం విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇది కొత్త పాయింట్ యే. జగన్ ఆలోచించాల్సిన పాయింటే. రాష్ట్రంలో జిల్లాల విభజనకు వెళ్లాల్సి వస్తే పెద్ద జిల్లాలుగా ఉన్న విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు,అనంతపురం, కర్నూలు వంటి జిల్లాలపై సి ఏం జగన్ ముఖ్యంగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ జిల్లాలను రెండు లేదా మూడు జిల్లా లుగా విభజించి మిగిలినవి భౌగోళిక పరంగా స్థానికుల అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కొత్త జిల్లాలు అనే ఆలోచనలోనే కొత్తగా పుట్టుకొస్తున్న వివాదాలు సమస్యలపై వైఎస్ జగన్మోహన రెడ్డి ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.