https://oktelugu.com/

వయసైన రవితేజం.. కొత్త సినిమాల యవ్వారం !

మాస్ మహారాజా అని బిరుదు సంపాధించిన రవితేజ పరిస్థితి.. ప్రస్తుతం అటు మాస్ కాకుండా ఇటు క్లాస్ కాకుండా మధ్యలో ఏది కాకుండా ఉంది. ఏ సినిమా చేయాలో.. ఎవరితో చేయాలో.. ఎలాంటి కథ చేయాలో ఏమి అర్ధం కావడం లేదు. వయసు చూస్తే బాగా కనిపించేస్తుంది, పోనీ వయసుకు తగ్గ పాత్రలు చేద్దాం అంటే కథలు దొరకవు. దొరికినా రవితేజ మీద అలాంటి కథలు చూస్తారా అనేది మరో అనుమానం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘క్రాక్’ […]

Written By:
  • admin
  • , Updated On : July 11, 2020 / 10:40 AM IST
    Follow us on


    మాస్ మహారాజా అని బిరుదు సంపాధించిన రవితేజ పరిస్థితి.. ప్రస్తుతం అటు మాస్ కాకుండా ఇటు క్లాస్ కాకుండా మధ్యలో ఏది కాకుండా ఉంది. ఏ సినిమా చేయాలో.. ఎవరితో చేయాలో.. ఎలాంటి కథ చేయాలో ఏమి అర్ధం కావడం లేదు. వయసు చూస్తే బాగా కనిపించేస్తుంది, పోనీ వయసుకు తగ్గ పాత్రలు చేద్దాం అంటే కథలు దొరకవు. దొరికినా రవితేజ మీద అలాంటి కథలు చూస్తారా అనేది మరో అనుమానం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘క్రాక్’ సినిమా ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. అసలుకే ఒక్క రవితేజను చూడటానికే రెడీగా లేరంటే.. మళ్ళీ ఇద్దరు రవితేజలా..!

    ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?

    పైగా రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను ఫిక్స్ చేశారు..నిధి అగర్వాల్ అంటే ఏదో భారీ కాయం కాబట్టి సరే అనుకోవచ్చు.. కానీ, రవితేజ పక్కన నభా నటేష్ ఏమిటి ? గతంలో చేసిన సినిమాలోనే ఆమె సెట్ అవ్వలేదు. పైగా అమ్ముడు ఫిజిక్ కూడా అంతంత మాత్రమే. అసలుకే రమేష్ వర్మ అనే డైరెక్టర్ సినిమా అనగానే సినిమా పై హోప్స్ సగం వదిలేసుకోవచ్చు. పైపెచ్చు ఇలాంటి క్యాస్టింగ్ తో రవితేజ మళ్ళీ హిట్ ఎలా కొట్టగలడో..!

    విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

    ఇంకో విషయం ఒకటి మర్చిపోయాం. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది.. ఈ సాంగ్ కోసం బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను ఫిక్స్ చేశారు. వయసు అయిపోయిన రవితేజ పక్కన మంచి కసి మీద ఉండే పాయల్ ఏమి బాగుంటుందని డైరెక్టర్ ఎందుకు ఆలోచించడో. ఎనీవే.. డబ్బులు గురించి పెద్దగా భయపడకుండా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. పాపం కోనేరుకు నిర్మాతగా పెద్దగా అనుభవం లేకపాయే. పైగా రవితేజ ‘డిస్కో రాజా’తో బాక్సాపీస్ వద్ద డిస్కో చేయలేక చేతులు ఎత్తేసిన సంగతి మరీ కోనేరుకు తెలుసో.. లేదో !