ఏదో ఒక షాప్ లో అదేదో మాస్క్.. అయితే జాగ్రత్త!

దేశంలో ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ నడుస్తోంది. చాలామంది లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించని పరిస్థితి కనబడుతోంది. దీర్ఘకాలం లాక్ డౌన్ వల్ల అటు ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. ఇప్పటికే కొందరు ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు దృష్టా ప్రభుత్వాలు కూడా దశలవారీగా లాక్ డౌన్ సడలిస్తున్నాయి. దీనితో మళ్లీ కరోనావైరస్ వ్యాప్తి రాకెట్ మాదిరిగా దూసుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతిక దూరం తప్పక పాటించాలి. […]

Written By: Neelambaram, Updated On : July 11, 2020 10:35 am
Follow us on

దేశంలో ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ నడుస్తోంది. చాలామంది లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించని పరిస్థితి కనబడుతోంది. దీర్ఘకాలం లాక్ డౌన్ వల్ల అటు ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. ఇప్పటికే కొందరు ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు దృష్టా ప్రభుత్వాలు కూడా దశలవారీగా లాక్ డౌన్ సడలిస్తున్నాయి. దీనితో మళ్లీ కరోనావైరస్ వ్యాప్తి రాకెట్ మాదిరిగా దూసుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతిక దూరం తప్పక పాటించాలి.

ఐతే ఏదో షాపులో దొరుకుతుంది కదా అని ఏది బడితే అది వాడితే కరోన బారి నుంచి రక్షించబడటం సాధ్యం కాదని వైద్యులు అంటున్నారు. పరిశుభ్రత, సామాజిక దూరం, మాస్కులు కరోనా ప్రమాదాన్ని తొలగించవు, కానీ అవి గణనీయంగా తగ్గించగలవు. లాక్ డౌన్ వారాలు, నెలల పాటు అనుభవించినవారిలో చాలామంది ఇతరుల నుండి తమ దూరాన్ని ఉంచడానికి ఆసక్తి చూపడంలేదు.

ఇప్పుడు రెస్టారెంట్లు, బార్‌ లు తిరిగి తెరిచారు. చాలామంది మాస్కులను ముక్కు నుంచి తొలగించి నోటికి వేసుకుంటూ కనబడుతున్నారు. మరికొందరు ముక్కు, నోరు రెండూ వదిలేసి గడ్డానికి తగిలించుకుని తిరుగుతున్నారు. ఇలాంటివారి పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఫేస్ మాస్క్‌ లు లాలాజలం యొక్క వైరస్ నిండిన కణాలను గాలిలో వ్యాపించకుండా, ఇతర వ్యక్తులకు సోకకుండా నిరోధించగలవు.

ఫేస్ మాస్క్‌ లు ధరించినవారికి సంక్రమణ ప్రమాదాన్ని 65% తగ్గించాయని కొత్త డేటా సూచిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనది. అంతేతప్ప అది పూర్తిగా నిరోధిస్తుందని వెల్లడికాలేదు. వైద్య నిపుణులు ధరించే N95 మాస్కులు మరింత రక్షణను అందిస్తాయి. ఈ మాస్కులు ప్రసార ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. కానీ ఇవి తక్కువ సరఫరా అవుతున్నాయి.