Prakash Raj Welcomes KCR: చాలా రోజులుగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్న కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేక కూటమిని కూడగట్టే పనిలో పడ్డారు. మొన్నటికి మొన్న తమిళనాడు వెళ్లి స్టాలిన్‌ను కలిసిన కేసీఆర్.. ఈసారి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసేందుకు తన సైన్యంతో కలిసి వెళ్లారు. అయితే ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు ఇందులో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కేసీఆర్ బృందం ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకోగానే.. అక్కడకు ప్రకాశ్ రాజ్ చేరుకుని కేసీఆర్ టీమ్‌కు స్వాగతం పలికారు. అయితే కేసీఆర్ తన వెంట వెళ్లిన వారందరినీ మర్యాదగా ప్రకాశ్ రాజ్‌కు పరిచయం చేశారు. ఇక అక్కడితోనే వెళ్లిపోతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ తన వెంట ప్రకాశ్ రాజ్‌ను కూడా తీసుకెళ్లారు. వీరంతా చర్చల్లో పాల్గొనడం ఇక్కడ విశేషం.
Also Read: KCR Meets Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ.. టార్గెట్ బీజేపీ..?
ప్రకాశ్‌రాజ్ కూడా చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎప్పటికప్పుడు బీజేపీ చేస్తున్న పనులను తప్పు బడుతూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీని విమర్శించడంలో ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే కేసీఆర, ఉద్ధవ్ ఠాక్రే మీటింగ్‌కు ప్రకాశ్ రాజ్‌ను ఎవరు ఆహ్వానించారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒకరకంగా చూస్తుంటే. కేసీఆరే ప్రకాశ్ రాజును పిలిచినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్‌ను ముంబైలో రిసీవ్ చేసుకుని వారి వెంటే వెళ్లి ఉద్ధవ్ ఠాక్రే వద్ద బొకే అందుకున్నాడు. కాబట్టి కేసీఆరే తన వ్యూహంలో భాగంగా అతన్ని పిలిచినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రకాశ్ రాజ్‌కు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. మొన్న మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ గా కనిపిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఇలా సడెన్‌గా ముంబై వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ మీటింగ్ మీద ప్రకాశ్ ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.
Also Read: CM KCR National Politics: జాతీయ రాజకీయాల కోసం ఈసారి ఎంపీగా పోటీ చేయనున్న కేసీఆర్ !?
Recommended Video: