Coach Rahul Dravid: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో కొనసాగుతూనే ఉంటాడు. ప్రస్తుతం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేల్చిన బాంబు బీసీసీఐలో కలకలం రేపుతోంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించినట్లు తెలిపాడు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే శ్రీలంక టెస్ల్ సిరీస్ కు జట్టును ఎంపిక చేశారు. ఇందులో అజింక రహానే, ఛెతేశ్వర్ పూజారా, ఇషాంత్ శర్మ, సాహాను కూడా దూరం పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఏం చెప్పారో వెల్లడించడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

బీసీసీఐ యాజమాన్యం ముందే నిర్ణయం తీసుకుందని తెలిపాడు. ఇందులో బాగంగానే తమను జట్టుకు ఎంపిక చేయలేదని కుండబద్దలు కొట్టాడు.దీంతో రాహుల్ మాటలు అతడిని ఎంతగా బాధించాయో తెలుస్తోంది. దీంతో రాహుల్, గంగూలీ పై విమర్శలు వస్తున్నాయి. తన రిటైర్మెంట్ పై కూడా ముందే నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు.
Also Read: కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ స్వాగతం.. మీ ప్లానేంది గులాబీ బాస్..?
గతేడాది నవంబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ లో రాణించినందుకు తనను గంగూలీ అభినందించారని చెప్పాడు. 61 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ప్రశంసించిన వారు ప్రస్తుతం ఇలా మాట్లాడటంతో వారి తీరుపై ఆక్షేపణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాహా వ్యాఖ్యలతో బీసీసీఐలో ఆందోళనలు కలుగుతున్నాయి.
బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు. ఆటగాళ్ల ఆట తీరు బాగానే ఉన్నా ఇలా రిటైర్మెంట్ కావాలని సూచించడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.మంచి ఆటగాడిని కూడా తప్పుకోవాలని సూచించడం దేనికి సంకేతం. ఇప్పటికే విమర్శలు మూటగట్టుకుంటున్న బీసీసీఐ నిర్వాకంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ.. టార్గెట్ బీజేపీ..?
Recommended Video:
