MP Ravikishan: జనాభా నియంత్రణపై పలువురు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలో జనాభా విస్ఫోటం పెరగడంతో భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పెరుగుతూ పోతుంటే వనరులు కూడా దొరకవనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో జనాభా నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందేననే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రవికిషన్ పార్లమెంట్ లో జనాభా నియంత్రణపై బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన తీరుపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నలుగురు బిడ్డల తండ్రి అయిన రవికిషన్ జనాభా పెరుగుదల గురించి ఎలా బిల్లు పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడన్నట్లు రవికిషన్ కు జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టే అర్హత లేదని వారి అభిప్రాయం. దీంతో జనాభా నియంత్రణపై చర్చ కొనసాగుతూనే ఉంది. అధిక సంతానం కలిగిన వ్యక్తే జనాభాపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విరుచుకుపడుతున్నారు.
Also Read: Chief Justice NV Ramana: నేనూ.. రాజకీయాల్లోకి రావాలనుకున్నా.. సీజేఐ సంచలన కామెంట్స్
ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడిని కలిగిన రవికిషన్ జనాభా నియంత్రణ బిల్లు ఎలా ప్రవేశపెడతారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాభా నియంత్రణ కోసం ఆలోచించడం కరెక్టే కాని ఆయన నిర్ణయం తీసుకోవడం ఏమిటని అడుగుతున్నారు. జనాభా నియంత్రణ కోసం అందరు పాటుపడాల్సిన అవసరం ఉన్నా దానికి రవికిషన్ ముందుకు రావడమే విచిత్రంగా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో జనాభా నియంత్రణ వ్యవహారం సవాలుగా మారుతోంది. పార్లమెంట్ లో చట్టం చేయాలని చూస్తున్నా దానికి ఎవరు సహకరించడం లేదని తెలుస్తోంది.

జనాభా నియంత్రణ బిల్లు తీసుకొచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జనాభా పెరుగుతున్నా దాన్ని నియంత్రణలో పెట్టే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కేంద్రం ఉదాసీనంగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ రవికిషన్ ప్రవేశపెట్టే బిల్లుకు ఎవరి మద్దతు కనిపించడం లేదు. దీంతో జనాభా నియంత్రణ సవాలుగానే పరిణమిస్తోంది. భవిష్యత్ లో తలెత్తే పరిణామాల క్రమంలో రవికిషన్ కు ఎవరు మాత్రం ముందుకు రావడం లేదు. అందుకే జనాభా నియంత్రణ చర్యలు తీసుకోవడానికి కేంద్రం కూడా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో రవికిషన్ ప్రవేశపెట్టే బిల్లు ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.
Also Read:Minister KTR: బయట మంత్రిని.. ఇంట్లో తండ్రిని.. బర్త్‌డే వేళ కేటీఆర్ కామెంట్స్ వైరల్
[…] […]