Superstar Rajinikanth: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అందరికి తెలిసిన నటుడు. తనదైన శైలిలో నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగిన కథానాయకుడు. సాధారణ బస్ కండక్టర్ గా ఉన్న రజనీకాంత్ ను తమిళ చిత్ర సీమ పెద్ద నటుడిగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చింది. తన నటనలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న నటుడు. ఆయన స్టైల్ కే అందరు ఫిదా అవుతారు. అంతటి ఘనతను సాధించుకున్న రజనీకాంత్ కు మానసిక సంతృప్తి రావడం లేదు. ఎన్నో చిత్రాలు, ఎంతో డబ్బు, హోదా సంపాదించుకున్న వీటిలో తృప్తి లేదని చెబుతున్నాడు. తాజాగా ‘హ్యాపీ సక్సెస్ ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంతృప్తి అనేది సంపదలో లేదని పెద్దలు చెప్పినట్లే. రజనీకాంత్ సాధించిన విజయాలు, సంపాదించిన ధనం, ఆర్జించిన ఖ్యాతి ఇవేవీ తనకు సంతృప్తిని తీసుకురాలేదని కుండబద్దలు కొట్టారు. తనకు ఆధ్యాత్మిక మీదే ఎక్కువ ఇష్టముంటుందని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. తాను తీసిన బాబా, రాఘవేంద్ర సినిమాలు తనకు ఎంతో తృప్తి ని ఇచ్చాయి. కానీ మిగతా చిత్రాలేవి తనకు అంతగా నచ్చలేదు. దీంతో భక్తిభావమే ముక్తి మార్గానికి దారి అని సెలవీయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: MP Ravikishan: జనాభా కంట్రోల్ బిల్లు.. ఆ నటుడిపై ఆడేసుకుంటున్న నెటిజన్లు
తాను తీసిన బాబా, రాఘవేంద్ర సినిమాలు చూసిన తన అభిమానులు ఇద్దరు సన్యాసులుగా మారినా తాను మాత్రం ఇంకా నటుడిగానే కొనసాగుతున్నానని చెబుతున్నారు. హిమాలయాల్లో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయని వాటితో అనేక రోగాలు నయమవుతాయని పేర్కొన్నారు. అందుకే ప్రతి వారు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తేనే అసలైన గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనిషికి ఆరోగ్యం ప్రధానమే. దాని కోసం అందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా తనకు కేవలం పది శాతం మాత్రం కూడా సంతృప్తి లేదు. సిద్ధయోగులు నిత్యం ఎంతో ఆనందంతో జీవిస్తున్నారు. అందుకే వీటన్నింటిని వదిలి సన్యాసం స్వీకరిస్తే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని తన మనసులోని మాటలను వ్యక్తీకరించారు. రజనీకాంత్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో రజనీకి ఇష్టమున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తన మార్గాన్ని మార్చుకోవడం వీలు కాదనే తెలుస్తోంది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాతే తన ఆశ నెరవేరుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:Minister KTR: బయట మంత్రిని.. ఇంట్లో తండ్రిని.. బర్త్‌డే వేళ కేటీఆర్ కామెంట్స్ వైరల్
[…] […]