Political Crisis in Maharashtra: మహారాష్ట్రలో మరో సంక్షోభం తలెత్తనుంది. శివసేన కాంగ్రెస్ కూటములు ఒక్కటిగా మారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజీపీకి భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలతో శివసేన కూటమి ఖంగుతింటోంది. హఠాత్పరిణామాలకు బాధ్యులెవరనే దానిపై ఆరా తీస్తోంది. తమ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు గుర్తిస్తోంది. కానీ శివసేన ఎమ్మెల్యేలు మంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ పరిస్థితి సందిగ్దంలో పడింది. ఇక ప్రభుత్వం కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది. ఏక్ నాథ్ షిండే వెంట 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు జరగడానికి ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఇన్నాళ్లు తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎవరి పనులు వారు చేసుకుంటుండటంతో ఏక్ నాథ్ కు ఆగ్రహం కలిగింది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలను తన వైు తిప్పుకుని తిరుగుబాటు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన సూరత్ లో ఉన్నట్లు సమాచారం. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వైఖరి వెల్లడించినట్లు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక: నేడు అధికార, విపక్షాల భేటీ..: తేలనున్న అభ్యర్థులు
మహారాష్ట్రలో సోమవారం జరిగిన శాసన మండలి ఎన్నికల్లో అఘాడీ కూటమి కి ఐదు సీట్లు రాగా బీజేపీకి ఐదు సీట్లు రావడం సంచలనం కలిగించింది. శివసేనకు రెండు, ఎన్సీపీకి రెండు, కాంగ్రెస్ కు ఒక స్థానాలు వచ్చాయి. బీజేపీకి నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశమున్నా ఐదు చోట్ల విజయం సాధించి ప్రభుత్వానికి సవాలు విసిరింది. బీజేపీకి 106 ఓట్ల బలం ఉండగా 133 ఓట్లు వచ్చాయి. దీంతో అఘాడీ కూటమిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీనికి ఏక్ నాథ్ షిండే కూడా కారణమైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అధికార కూటమిని గద్దె దించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసమే ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించిందని తెలుస్తోంది. ఇలాగే కర్ణాటకలో కూడా అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ప్రస్తుతం మహారాష్ర్టలో కూడా అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో శివసేన ప్రభుత్వానికి ఇక చుక్కలే అని చెబుతున్నారు. బీజేపీ అనుకుంటే దేన్నయినా ఇట్లే సాధిస్తుంది. అందుకే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారం చెలాయించాలని చూస్తున్నట్లు పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.
మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ కూటమిలో పడకపోవడంతోనే ఏక్ నాథ్ వేరు కుంపటి రగిలించినట్లు తెలుస్తోంది. దీంతో అఘాడీ ప్రభుత్వ మనుగడ కష్టమనే వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ అభీష్టం నెరవేరుతుందా? లేక శివసేన ఇంకేదైనా జిమ్మిక్కులు చేసి పదవి కాపాడుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.
Also Read:AP CM YS Jagan: పనిచేస్తారా? చస్తారా? జగన్ మారిపోయాడుగా?