Fish Rain in Kaleshwaram: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు వింతలు జరుగుతుంటాయి. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. భవిష్యత్ దృష్టిని ఆలోచించి ఆయన మనకు ఎన్నో విశేషాలు చోటుచేసుకుంటాయని తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు అలాంటి వింతలు కొన్ని మనకు కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఇదే కోవలో కాళేశ్వరంలో చేపల వర్షం కురిసిందనే వార్త హల్ చల్ చేస్తోంది. రోడ్డుపై చేపలు పడటంతో ప్రజలు వాటిని సేకరించారు. చేపల వర్షం కురిసిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.

నీళ్ల వర్షం కురవడం మనకు తెలిసిందే కానీ చేపల వర్షం కురవడమేమిటనే వాదన అందరిలో వస్తోంది. దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పారు. చిన్న నీటి కాలు ఉన్నా సరే చేపలు బయటకు వస్తాయి. అందులో భాగంగానే అవి చెరువు నుంచి రోడ్డు మీదకు వచ్చినట్లు పేర్కొంటున్నారు. అంతేకానీ ఇందులో అద్భుతం ఏదీ లేదని తేల్చారు. వర్షం పడినప్పుడు వర్ష ధార నుంచి కూడా చేపలు పడటం మామూలే. దానికి చేపలవర్షం కురిసిందని చెప్పడం సరైంది కాదని సూచిస్తున్నారు.
Also Read: Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక: నేడు అధికార, విపక్షాల భేటీ..: తేలనున్న అభ్యర్థులు
సముద్ర తీర ప్రాంతాల్లో సుడిగాలి వచ్చినప్పుడు నీటితో పాటు చేపలు లేచి మేఘాలతో పాటు వర్షంగా కింద పడతాయని తెలుస్తోంది. అందుకే రోడ్డుపై అలా చేపలు పడినట్లు చెబుతున్నారు. దీంతో ప్రజలు వాటిని ఏరుకుని పోగు చేశారు. తమకు చేపలు దొరకడంతో సంబరపడిపోయారు. దీనికి చేపల వర్షం కురిసిందని చెప్పడంలో అర్థం లేదని సూచిస్తున్నారు. దీన్ని వాడుక భాషలో నటు గురక అని పిలుస్తారని తెలుస్తోంది. దీనికి శాస్త్రీయ నామం టెస్ట్ ట్యూడియస్ అని పిలుస్తారని చెప్పారు.

కలియుగంలో జరిగే వింతగా చెప్పుకుంటున్నా అందులో వాస్తవం లేదని అధికారులు తేల్చేస్తున్నారు. వర్షానికి చేపలు పాక్కుంటూ కూడా వస్తాయని చెబుతున్నారు. దీంతో చేపల వర్షం కాదని వివరణ ఇచ్చారు. భారీ వర్షానికి చేపలు రోడ్లపై పడటంతో ప్రజలు పండగ చేసుకున్నారు. చేపలను పోగు చేసుకుని సరదాగా పులుసు పెట్టుకుని ఎంజాయ్ చేశారు. ఏది ఏమైనా వారికి ఒక రోజు కూర లోటు మాత్రం తీరిందని తెలుస్తోంది. దీంతో చేపల వర్షం కాదని అదంతా వట్టిదేనని కొట్టిపారేశారు.
Also Read:AP CM YS Jagan: పనిచేస్తారా? చస్తారా? జగన్ మారిపోయాడుగా?