Homeజాతీయ వార్తలుUniform Civil Code implementation: సివిల్‌ కోడ్‌ అమలు.. బీజేపీకి కొత్త ఊపిరి.. విచ్చిన్న వాదుల...

Uniform Civil Code implementation: సివిల్‌ కోడ్‌ అమలు.. బీజేపీకి కొత్త ఊపిరి.. విచ్చిన్న వాదుల ప్లాన్ ఏంటి?

Uniform Civil Code implementation: యూసీసీ(యూనిఫైడ్‌ కామన్‌ సివిల్‌కోడ్‌) దేశంలో అమలు చేసేందుకు కేంద్రం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కానీ, విపక్షాలు తరచూఅడ్డుకుంటున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ఈ చట్టం అమలు ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు 1937 షరియా చట్టం ముస్లిం మహిళల ఆస్తి హక్కుల్లో వివక్ష సృష్టిస్తోందనే పిటిషన్‌పై ఈ వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్త ఏకీకృత పౌర చట్టం (యూసీసీ) అమలు అత్యవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని కొట్టివేస్తే చట్ట శూన్యత ఏర్పడుతుందని, శాసనసభ చర్యలు తీసుకోవాలని సూచించింది.

మహిళల ఆస్తి హక్కుల్లో అసమానతలు
షరియా నిబంధనలు మహిళలకు పురుషులతో పోలిస్తే తక్కువ వాటాను కేటాయిస్తాయి. ధర్మాసనం ఈ వివక్షను గుర్తించి, సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ముస్లిం మహిళలు పొందుతున్న హక్కులను కోల్పోకుండా రక్షించాలని సీజేఐ సూర్యకాంత్‌ హెచ్చరించారు. భారత వారసత్వ చట్టాన్ని వర్తింపజేయాలనే వాదనను కోర్టు తిరస్కరించింది.

యూనిఫాం సివిల్‌ కోడ్‌ అవసరం
రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం యూసీసీ అమలు పార్లమెంటు బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. గతంలో కోర్టులు యూసీసీ సిఫారసు చేశాయి, కానీ శాసనాధికారులు స్పందించకపోవడం ఆందోళనకరం. ఒకే భార్యా నిబంధన అన్ని వర్గాలకు వర్తింపకపోవడాన్ని జస్టిస్‌ బాగ్చీ ఎత్తిచూపారు. ఈ సమానత్వం లేకపోవడం పౌరుల మధ్య విభేదాలకు దారితీస్తోంది.

Also Read: 15 గంటల పాటు క్రూరమైన పులికి ఎదురొడ్డింది.. చివరికి ఈ అధికారిణి జీవితం ఏమైందంటే?

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో యూసీసీ అమలుకు ఒత్తిడి పెరుగుతుంది. షరియా చట్టం మహిళల ఆర్థిక భద్రతను బలహీనపరుస్తూ, ఆధునిక సమాజంతో పోలికలేని అసమానతలు కలిగిస్తోంది. ఈ న్యాయపరమైన శూన్యత దూరం కాకపోతే, మతపరమైన చట్టాలు రాజ్యాంగ విలువులకు విరుద్ధంగా మారతాయి. అందుకే యూసీసీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version