Homeఆంధ్రప్రదేశ్‌CBI Counter Petition On Jagan: జగన్ టూర్ కు అనుమతి వద్దు.. ప్రత్యేక కోర్టులో...

CBI Counter Petition On Jagan: జగన్ టూర్ కు అనుమతి వద్దు.. ప్రత్యేక కోర్టులో సీబీఐ కౌంటర్

CBI Counter Petition On Jagan: ఏపీ సీఎం జగన్ వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సారి ఆయన వ్యక్తిగత పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడంతో కేసు విచారణలో ఆలస్యం జరుగుతోందని సీబీఐ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌ పర్యటనకు అనుమతివ్వాలన్న జగన్‌ పిటిషన్‌పై సీబీఐ, నాంపల్లి కోర్టులో కౌంటరు దాఖలు చేసింది. సీఎం జగన్‌ వివిధ కారణాలు చెబుతూ విదేశాలకు వెళ్తున్నారని సీబీఐ అభిప్రాయపడింది. కాగా, జగన్‌ తన కుమార్తె హర్షారెడ్డి కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఈనెల 28 నుంచి వారం రోజులు అనుమతి ఇవ్వాలని గత వారం కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌ రమేశ్‌బాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.సీఎం జగన్ ప్రతీ సారి ఏదో కారణం చెప్పి విచారణను ఆలస్యం చేయిస్తున్నారని సీబీఐ న్యాయవాదులు కోర్టు ద్రుష్టికి తీసుకొచ్చారు.

CBI Counter Petition On Jagan
Jagan

ఆ షరతులతో..
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ షరతుల్లో భాగంగా పాస్ పోర్టును కోర్టు అధీనంలో ఉంది. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదు. అందుకే ఎప్పుడు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా ఆయన కోర్టు అనుమతి తీసుకుంటారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతపెద్దగా విదేశాలకు వెళ్లలేదు. సీఎం అయిన తర్వాత ఓ సారి జెరూసలెం.. మరోసారి అమెరికా… వెళ్లారు. రెండు సార్లు విహారయాత్రలకు వెళ్లారు. మొత్తం మీద నాలుగైదు సార్లు మాత్రమే వెళ్లారు. అయితే ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లాలని పిటిషన్ పెట్టుకున్న కోర్టు అనుమతి ఇస్తోంది. సీబీఐ మాత్రం పర్మిషన్ ఇవ్వవొద్దని కౌంటర్ వేస్తూనే ఉంది. కేసుల విచారణ ఆలస్యమవుతోందని వాదిస్తూనే ఉంది. అయితే కోర్టులో ఆ వాదనలు నిలబడటం లేదు. జగన్‌కు పర్మిషన్ లభిస్తోంది. ఈ సారి కూడా జగన్ కు ప్యారిస్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ పర్యటన ఎప్పటి నుండి ఎప్పటి వరకూ అనేది తేలాల్సి ఉంది.

Also Read: Political Crisis in Maharashtra: మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను కూల్చే పనిలో బీజేపీ

గత పర్యటన వివాదాస్పదం..
అయితే గతసారి దావోస్ లో ప్రపంచ వాణిజ్య సదస్సుకు జగన్ హాజరయ్యారు. అప్పట్లో సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. కానీ ప్రపంచ వాణిజ్య సదస్సు తరువాత ఆయన వ్యక్తిగత పర్యటన కూడా సాగించినట్టు వార్తలు వచ్చాయి. అధికారిక కార్యక్రమమైతే తప్పనిసరిగా తన వెంట అధికారులను తీసుకెళతారు. ఇందుకు సంబంధించి పక్కగా అధికారిక సమాచారం వెల్లడిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన సాగిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. గుట్టుగా సాగడం అప్పట్లో అనుమానాలకు తావిచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్లు కాకుండా… మరోరకంగా ఎందుకు జరిగింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన… ముందస్తు షెడ్యూలు ప్రకారం కాకుండా, ‘డీవియేషన్ల’తో సాగవచ్చునా? అన్న అనుమానాలు తలెత్తాయి. నాడు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్‌ స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు వెళ్తున్నారు అని మాత్రమే చెప్పారు. కానీ ఈ బృందంలో జగన్‌ సతీమణి కూడా ఉన్నారని అందులో చెప్పలేదు. అయితే ఈ సారి అంతా వ్యక్తిగత పర్యటన కావడం పూర్తిస్థాయి వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక: నేడు అధికార, విపక్షాల భేటీ..: తేలనున్న అభ్యర్థులు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version