https://oktelugu.com/

తెలంగాణ ప్రజలకు ప్రధాని, రాష్ట్రపతి శుభాకాంక్షలు!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్.. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు […]

Written By: , Updated On : June 2, 2020 / 12:09 PM IST
Follow us on

Modi

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్.. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం’ అని పేర్కొన్నారు.