https://oktelugu.com/

PM kisan : రేపే రైతుల ఖాతాల్లో రూ.2 వేలు.. అవి ఉంటేనే ఖాతాలో నగదు.. చెక్ చేసుకోండిలా!

గత కొద్ది రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగు ప్రోత్సాహం కింద రైతులకు నగదు అందిస్తున్నాయి. ముఖ్యంగా గత 17 విడతల్లో.. ఒక్కో రైతుకు 34 వేల రూపాయలు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 18వ సారి అందించేందుకు సిద్ధపడుతోంది.

Written By: Dharma, Updated On : October 4, 2024 11:46 am
PM Kisan Samman Yojana

PM Kisan Samman Yojana

Follow us on

PM kisan : రైతులకు గుడ్ న్యూస్. దేశంలోని కోట్లాదిమంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు సాగు ప్రోత్సాహం కింద అందించే పీఎం కిసాన్ నగదును ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మన్ యోజన పథకం తీసుకొచ్చి ఏడాదికి 6 వేల రూపాయలు సాగు ప్రోత్సాహం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సాయం ఒకేసారి అందించకుండా.. 3 విడతల్లో 2000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటివరకు 17 విడతల్లో అర్హులైన రైతులకు పంట సాయం అందించింది కేంద్రం. ఇప్పుడు 18వ విడతగా అందించనుంది. రేపు ఎందుకు ముహూర్తంగా నిర్ణయించింది. రేపు ప్రధానమంత్రి మోడీ పీఎం కిసాన్ యోజన 18వ విడత నిధులు విడుదల చేయనున్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది రైతుల ఖాతాల్లో 2000 చొప్పున నగదు జమ కానుంది.

* ఈ కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ పథకానికి అర్హత సాధించాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటిపి ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చు. లేకుంటే సమీపంలోని సిఎల్సి కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అతేంటికేషన్ ఆధారిత కేవైసీ పూర్తి చేసేందుకు సైతం ఛాన్స్ ఉంది. ఇప్పటికీ కేవైసీ పూర్తి చేయకుంటే.. వెంటనే పూర్తి చేయడం మంచిది. అప్డేట్ అయిన మరుక్షణం పిఎం కిసాన్ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.

* ఇలా చెక్ చేసుకోవచ్చు
పీఎం కిసాన్ సాయానికి సంబంధించి లబ్ధిదారులు తమ పేర్లు ఉన్నాయో లేదో చాలా సులువుగా తెలుసుకోవచ్చు. అందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkissan.gov.in/ లోకి వెళ్ళాలి. ఆ తరువాత బెన్ఫిషియరీ స్టేటస్ పేజీలోకి ప్రవేశించాలి. దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ పై లబ్ధిదారుల స్టేటస్ కనిపిస్తుంది. సాధారణంగా పీఎం కిసాన్ వెబ్సైట్ హోం పేజీలో అన్ని ఆప్షన్లో కనిపిస్తాయి. ఈ కేవైసీ అప్డేట్, కొత్త రైతుల రిజిస్ట్రేషన్, కేవైసీ స్టేటస్, మొబైల్ నెంబర్ అప్డేట్, వాలంటరీ సరెండర్, బెన్ఫిషియరీ లిస్ట్ అన్నీ ఉంటాయి. దీని గురించైనా సమగ్రంగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.