https://oktelugu.com/

Serial Actress Rajitha Accident: మద్యం మత్తులో కారు నడిపిన సీరియల్‌ నటి.. రెండు వాహనాలు ధ్వంసం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. మినీ సినిమా ఇండస్ట్రీగా ఎదిగిన సీనియల్‌ రంగం కూడా రంగుల ప్రపంచంగా మారింది. షూటింగ్‌లో అలసిపోవడం, వర్క్‌ ప్రెషర్‌ కారణంగా నటీనటులు మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 4, 2024 / 11:42 AM IST

    Serial Actress

    Follow us on

    Serial Actress: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. సినిమా ఇండస్ట్రీకి దీటుగా ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ కూడా ఎదుగుతోంది. రియాలిటీ షోలు, కామెడ షోలు, సీరియళ్లు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో టీవీ ఇండస్ట్రీ కూడా క్రమంగా ఆదరణ పొందుతోంది. నటీనటులకు పుష్కల అవకాశాలు లభిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అందమైన అమ్మాయిలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. పురుషులు కూడా వివిధ భాషల నుంచి వస్తున్నారు. టీవీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కేరళ సీరియల్‌ నటి రజిత కూడా తెలుగు, కన్నడ, మళయాలం సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా కేరళలో రజిత ఓ యాక్సింట్‌ చేశారు. మద్యం మత్తులో కారు నడుపుతూ రెండు వాహనాలను ఢీకొట్టారు. దీంతో రెండు వాహనాలు ధ్వసంమయ్యాయి.

    తిరువనంతపురం ఎంసీ రోడ్డులో..
    నటి రజిత గురువారం రాత్రి మద్యం తాగి 7 గంటల సమయంలో తిరువనంతపురంలోని ఎంసీ రోడ్డు మీదుగా స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పతనంతిట్టలోని కులన్నాడ వద్ద ప్రమాదం జరిగింది. రద్దీ ఉండే ప్రాంతంలో ప్రమాదం జరుగడంతో భారీగా ట్రాపిక్‌ నిలిచిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నటి రజిత మద్యం తాగి ఉన్నట్లు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.
    మద్యం తాగి..
    మద్యం తాగిన రజిత సొంతంగా కార్డు డ్రైవ్‌ చేయమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పరిమితికి మించి మద్యం తాగి మత్తులో కారు నడుపుతూ వెళ్లిన నటి.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును మొదట ఢీకొట్టింది. తర్వాత అలాగే ముందుకు వెళ్లి మరో మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదాల్లో ఎవరికీ గాయాలు కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందుభాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిసింది.

    గతంలో నటి లహరి..
    గతంలో తెలుగు సీరియల్‌ నటి లహరి కూడా ఇలాగే మద్యం మత్తులో కారు నడుపుతూ బైక్‌ను ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఔటర్‌ రింగ్‌రోడ్డపై ప్రైవేటు పెట్రోలింగ్‌ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా లహరి కారుతో ఢీకొట్టింది. అక్కడికి వచ్చిన స్థానికులు ఆమెను బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. కారు దిగిన నటి లహరిని చూసి షాక్‌ అయ్యారు. అయితే ఆమె అప్పటికే మద్యం తాగి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లహరిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షచేయగా ఆమె మద్యం తాగలేదని తేలింది.