https://oktelugu.com/

Nara Lokesh : వరద బాధితుల అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల ఖర్చు రూ.23 కోట్లా.. లోకేష్ ఆశ్చర్యం

సోషల్ మీడియా వచ్చాక రాజకీయ పార్టీల మధ్య అంతర్యుద్ధం పెరిగింది. అధికార, విపక్షాల మధ్యమాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షం ప్రయత్నిస్తుండగా.. విపక్షం ప్రచారాన్ని తిప్పి కొడుతోంది అధికార పక్షం. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే.

Written By:
  • Dharma
  • , Updated On : October 4, 2024 / 11:54 AM IST

    Nara Lokesh

    Follow us on

    Nara Lokesh :  ఏపీలో అధికార విపక్షాలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి దిగుతున్నాయి. పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఏ చిన్న అవకాశం దక్కినా వదలడం లేదు. ఇటీవల ఏపీకి వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేశాయి. దాదాపు లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. పెద్ద ఎత్తున పునరావాసం కల్పించింది. బాధితులకు అండగా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో వైసిపి ఒక ప్రచారానికి తెరతీసింది. కొంతమంది ఆ పార్టీ అభిమానులు వరద సాయం పై విమర్శలు చేశారు. రూ. 23 కోట్లతో అగ్గిపెట్టెలు అందించారా? గుడ్డివిజనరీ అనడంలో తప్పు లేదేమో? కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకు 23 కోట్లు అవుతాయా? ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరు లక్షల మంది బాధితులు ఉన్నారు. ఒక్కో ఇంటికి నలుగురు మనుషులు అనుకున్న లక్ష 50వేల ఇల్లు లేదా రెండు లక్షల వరకు ఇల్లు ఉంటాయి. ఒక్కో ఇంటికి ఐదు కొవ్వొత్తులు అందిస్తే 25 రూపాయల ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రెండు కోట్ల రూపాయలకు మించి అవ్వదు. కానీ 23 కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతారా? సంక్షోభ సమయంలో ఈ దోపిడీ ఏంటి? అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టింది.ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    * అవి ఫేక్ ప్రచారాలు
    తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కల్తీ జగన్ ఎందుకు ఈ ఫేక్ ప్రచారాలు. వరద సాయం ఎంత ఇచ్చాం.సహాయ చర్యలకు, ఆహారానికి ఎంత ఖర్చయింది అని లెక్కలు ఓపెన్ గానే ఉన్నాయి. అయినా నీ దొంగ బుద్ధి వదలవు. అగ్గిపెట్టెలకు 23 కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అంటూ మండిపడ్డారు లోకేష్. లోకేష్ తాజా ట్విట్లను టిడిపి వైరల్ చేయడం ప్రారంభించింది.

    * ఫ్యాక్ట్ చెక్ పేరిట కౌంటర్
    ఇటీవల ప్రభుత్వం పై వైసీపీ చేస్తున్న విమర్శలపై లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఫ్యాక్ట్ చెక్ పేరిట ప్రత్యేక విభాగాన్ని నడుపుతున్నారు. సోషల్ మీడియాలో అదే పనిగా వైసిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. ఫెక్ అని తేల్చి అదే సోషల్ మీడియాలో విడిచి పెడుతున్నారు. అయితే కొన్ని అంశాలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అందుకే టిడిపి సోషల్ మీడియా విభాగం చాలా అలర్ట్ గా ఉంది. లోకేష్ సైతం వీలున్నంతవరకు వైసీపీ చర్యలను తప్పుపడుతూ బాగానే తిప్పి కొడుతున్నారు.