AP Liquor Rates: ఇంతకీ మద్యం ధరలు తగ్గాయా? పెరిగాయా? ఎల్లో మీడియా కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ వనరు. దీనికి గానీ గండి కొడితే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవచ్చన్నది ఎల్లో మీడియా భావన.

Written By: Dharma, Updated On : November 22, 2023 2:11 pm

AP Liquor Rates

Follow us on

AP Liquor Rates: మద్యం ధరల పెంపు విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. మద్యం ధరలు పెరిగిన మాట వాస్తవమే అయినా.. తగ్గాయంటూ ఒకసారి.. పెరిగాయంటూ మరోసారి ఎల్లో మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గాయని.. అవన్నీ వైసీపీ నేతల కంపెనీకి చెందిన బ్రాండ్లేనని ఈనాడు ప్రత్యేక కథనం రాసుకొచ్చింది. అటు ఆంధ్రజ్యోతి సైతం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ప్రత్యేక కథనం రాసుకొచ్చింది. ఈ రెండు టిడిపి అనుకూల మీడియా సంస్థలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం విశేషం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ వనరు. దీనికి గానీ గండి కొడితే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవచ్చన్నది ఎల్లో మీడియా భావన. రాష్ట్రంలో మద్యం ధరలపై పన్నుల విధానాన్ని ప్రభుత్వం ఇటీవల హేతుబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిని మైసి పూసి మారేడు కాయ చేసే క్రమంలో ఎల్లో మీడియా రాతలు కాస్త అతి అనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లేని మద్యం బ్రాండ్లు, స్టాక్ లేని బ్రాండ్ల పేర్లను ఎల్లో మీడియా చెబుతుండడం విశేషం. ఒకరు అస్మదీయుల కోసమే కొన్ని మద్యం బ్రాండ్ల ధరలు తగ్గించారని రాసుకొని రాగా.. మరొకరు మద్యం బ్రాండ్ల ధరలు తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని రాసుకొచ్చారు.

వాస్తవానికి మద్యం ఉత్పత్తులపై పన్నుల విధానాన్ని హేతుబద్ధీకరిస్తూ స్వల్పంగా ఏఆర్ఈటి, ఏఈడి, వ్యాట్ పన్నులతో పాటు స్పెషల్ మార్జిన్ ను ప్రభుత్వం సవరించింది. అన్ని బ్రాండ్ల మద్యం ఉత్పత్తుల బేసిక్ ధరలపై పనుల శాతాన్ని నిర్ణయిస్తూ ఒకే తాటిపై తీసుకొచ్చింది. దీంతో కొద్ది బ్రాండ్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. చాలా రకం బ్రాండ్ల ధరలు యథాతదంగా కొనసాగుతున్నాయి. అటు ఎల్లో మీడియా చెబుతున్నట్టు పెరిగిన మద్యం బ్రాండ్లు అసలు దుకాణాల్లో లేవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకు ఈ తరహా ప్రచారానికి ఎల్లో మీడియా దిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో వాస్తవం లేదని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే మద్యం విధానం పై ప్రజల్లో ఒక రకమైన భావన ఉంది. దానిని మరింత రెచ్చగొట్టి వైసీపీ సర్కార్ కు డ్యామేజ్ చేయాలన్న యోచనలో ఎల్లో మీడియా ఉండడం విశేషం.