Rashmika Mandanna: యానిమల్ సినిమా హిట్ అయితే రష్మిక టాలీవుడ్ కు దొరుకుతుందా?

బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఈమె హిందీలో నటించిన సినిమాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ మాత్రం మంచి ఫలితాలను మాత్రమే కాదు పూర్తిగా బాలీవుడ్ లోనే బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written By: Suresh, Updated On : November 22, 2023 12:19 pm

Rashmika Mandanna

Follow us on

Rashmika Mandanna: ఛలో గీత గోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ రష్మిక మందన. ఈ సినిమాలతో ఆమె రేంజ్ ఫుల్ గా పెరిగిపోయింది. ఇక పుష్ప సినిమాతో ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మారింది. ఈమె నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ అవడంతో ఇక తిరుగులేకుండా పోయింది. అంతే కాదు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో బన్నీ సరసన నటించి పాన్ ఇండియా స్టార్ గా నిలిచింది. తాజాగా అమ్మడి అందాల ఆరబోత ఫోటో షూట్స్ వైరల్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది రష్మిక. సౌత్ లో ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించింది.

ఈ భామ బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఈమె హిందీలో నటించిన సినిమాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ మాత్రం మంచి ఫలితాలను మాత్రమే కాదు పూర్తిగా బాలీవుడ్ లోనే బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించాలని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట. అందుకే యానిమల్ సినిమా కనుక హిట్ అయితే వరుసగా అక్కడ ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రష్మిక అనుకున్నట్టుగా పరిస్థితి ఉంటే ఈ అమ్మడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే టాలీవుడ్ తో పాటు ఇతర సౌత్ సినిమాలకు ఆమె మొహం చాటేయడం కూడా పక్కా కావచ్చు అంటున్నారు కొందరు. ఎందుకంటే ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీ పై, టాలీవుడ్ ఇండస్ట్రీపై నెగటివ్ కామెంట్స్ చేసింది రష్మిక. దీంతో బాలీవుడ్ లో బిజీ అయితే ఏ ఇండస్ట్రీ దిక్కు కూడా చూడదు అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తం మీద యానిమల్ ఫలితంపై అందరి దృష్టి ఉంది. సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో కూడా రష్మిక ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తోంది. అంతేకాకుండా మరో రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తుందని టాక్.