జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

రాజకీయాలలో పవన్-జగన్…ఉప్పు-నిప్పు తీరు. జగన్ కి ప్రతిపక్షానికి మించిన ప్రధాన ప్రత్యర్థిగా పవన్ ఉన్నారు. టీడీపీ బీజేపీ కూటమిలో ఉన్నప్పటి నుండి పవన్ టార్గెట్ జగన్ మాత్రమే. అందుకే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా..పవన్ విమర్శల దాడి జగన్ పైనే ఉండేది. ఇక 2019 ఎన్నిలలో గెలిచి జగన్ సీఎం కాగా, అనేక సంధర్భాలలో పవన్ 151 మంది ఎమ్మెల్యేలతో మీరు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ తీరును ప్రశ్నించిన పవన్ ఇక ఆయన అధికారంలో […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 3:01 pm
Follow us on


రాజకీయాలలో పవన్-జగన్…ఉప్పు-నిప్పు తీరు. జగన్ కి ప్రతిపక్షానికి మించిన ప్రధాన ప్రత్యర్థిగా పవన్ ఉన్నారు. టీడీపీ బీజేపీ కూటమిలో ఉన్నప్పటి నుండి పవన్ టార్గెట్ జగన్ మాత్రమే. అందుకే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా..పవన్ విమర్శల దాడి జగన్ పైనే ఉండేది. ఇక 2019 ఎన్నిలలో గెలిచి జగన్ సీఎం కాగా, అనేక సంధర్భాలలో పవన్ 151 మంది ఎమ్మెల్యేలతో మీరు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ తీరును ప్రశ్నించిన పవన్ ఇక ఆయన అధికారంలో ఉంటే ఊరుకుంటాడా? బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో పవన్ విభేదించారు.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానులు నిర్ణయాలను పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా కాపు నేస్తం పథకం,కాపు రిజర్వేషన్ లు పక్కదారి పట్టించడానికి జగన్ పన్నిన వ్యూహం అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతి పథకాన్ని వ్యతిరేకించిన పవన్ 108, 104 అంబులెన్స్ వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని అభినందించారు. కరోనా కష్ట కాలంలో ఏపీ ప్రభుత్వ పని తీరును ఆయన కొనియాడారు. అత్యవసర పరిస్థితులలో అంబులెన్సు సర్వీసుల ప్రారంభించడం అభినందనీయం అన్నారు. మొదటిసారి జగన్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించి పవన్ రాజకీయ వర్గాలను, తన జనసేన సైనికులను విస్మయానికి గురిచేశారు.

జగన్ ని సడన్ గా పొగడడం వెనుక పవన్ వ్యూహం ఏంటని ఆలోచిస్తే…ఇది ఆయన ఇమేజ్ ని పెంచే అంశమే అని అర్థం అవుతుంది. జగన్ నిర్ణయాలను ఎప్పుడూ వ్యతిరేకించే పవన్ అంబులెన్సుల విషయంలో పొగడడం వలన ఆయన మంచిని, చెడుని విభజించి చూస్తాడని… చెప్పే ప్రయత్నం చేశారు. తనది విలువలతో కూడిన విమర్శ అని…మంచి చేస్తే ఎవరినైనా అభినందిస్తామని, చేడు చేస్తే వ్యతిరేకిస్తామని ప్రజలలో అభిప్రాయం కలిగేలా చేశారు. దీని వలన భవిష్యత్ లో జగన్ ప్రభుత్వంపై ఆయన చేసే విమర్శలకు విలువ చేకూరుతుంది అనేది పవన్ నిర్ణయం కావచ్చు. కావున ఇక్కడ పొగిడి జగన్ ఇమేజ్ పెంచినా, తన విమర్శలకు విలువ పెంచుకున్నాడు పవన్. కాబట్టి పవన్ కూడా రాజకీయాలలో రాటు తేలుతున్నాడని చెప్పుకోవచ్చు.