https://oktelugu.com/

దేవుడా: అటు ప్రభుత్వం చేయదు.. ఇటు ప్రైవేటు దోపిడీ

విద్యా, వైద్యం.. ఇలాంటి కీలకాంశాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటే జనాలకు మేలు. అందుకే సీఎం కేసీఆర్ మొదట కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వనన్నాడు. కేసులు పెరగడం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులకు పాకడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు అప్పగించేశారు. కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు కేసీఆర్ పర్మిషన్ ఇవ్వడం.. కరోనా టెస్టుకు ఇంత..చికిత్సకు ఇంత అని డిసైడ్ చేయడం కూడా జరిగిపోయింది.. కానీ తెలంగాణలో ‘ప్రైవేటు’ ల్యాబ్ లు.. ప్రైవేటు ఆస్పత్రులు దందా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2020 2:58 pm
    Follow us on


    విద్యా, వైద్యం.. ఇలాంటి కీలకాంశాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటే జనాలకు మేలు. అందుకే సీఎం కేసీఆర్ మొదట కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వనన్నాడు. కేసులు పెరగడం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులకు పాకడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు అప్పగించేశారు.

    కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు

    కేసీఆర్ పర్మిషన్ ఇవ్వడం.. కరోనా టెస్టుకు ఇంత..చికిత్సకు ఇంత అని డిసైడ్ చేయడం కూడా జరిగిపోయింది.. కానీ తెలంగాణలో ‘ప్రైవేటు’ ల్యాబ్ లు.. ప్రైవేటు ఆస్పత్రులు దందా మొదలుపెట్టాయి. చికిత్సకు 10 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక కరోనా టెస్టులకు 2200 ఎవరూ తీసుకోవడం లేదు. అంతకుమించి వసూలు చేస్తున్నారు.

    అయితే ప్రభుత్వ వైద్యం, చికిత్స అంత బాగా లేకపోవడం.. కేసులు పెరగడంతో ఆస్తులు అమ్మి అయినా అందరూ ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ లకే వెళుతున్నారు. ప్రజల ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే దగ్గువచ్చినా.. తుమ్ము వచ్చినా వెంటనే టెస్టులు చేయించుకుంటున్నారు.. ప్రజల భయాన్ని మరింత క్యాష్ చేసుకోవాలనుకున్నారో ఏమో కానీ.. ఆ ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే ఏకంగా కరోనా కేసులు కుప్పలుగా నమోదవుతున్నాయి. ఏం చేస్తున్నారో.? ఎలా చేస్తున్నారో తెలియదు కానీ.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ లో తాజాగా పాజిటివ్ కేసులు కుప్పలుగా నమోదుకావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

    జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

    తాజాగా ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో 3726 శాంపుల్స్ ను టెస్ట్ చేయగా.. అందులో 2672 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఆ ఒక్క ల్యాబ్ లోనే పాజిటివిటీ ఏకంగా 71.7శాతంగా నమోదు కావడం గమనార్హం.దీంతో ఆ ల్యాబ్ లో సరిగ్గా చేస్తున్నారా? పైసల కోసం కార్పొరేట్ ఆస్పత్రులతో మిలాఖత్ అయ్యి ఇలా రిపోర్టులు ఇస్తున్నారో నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వెంటనే పరిశీలించి ఆ ల్యాబ్ ను మూసివేయడంతోపాటు ఆ శాంపుల్స్ ను తిరిగి పరిశీలిస్తోంది.

    ఇప్పుడు తెలంగాణలో కరోనా కేసులు పెరగడం వెనుక కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేయకపోవడం ఒక కారణం కాగా.. ప్రైవేటు ల్యాబులు, ఆస్పత్రులు దోచుకోవడంలో భాగంగా కూడా ఇలా పాజిటివ్ లను పెద్ద ఎత్తున నమోదు చేస్తున్నాయి. ఈ రెండు కారణాల వల్ల తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. అటు ప్రభుత్వం చేయదు.. ఇటు ప్రైవేటు దోపిడీతో కునారిల్లిపోతున్నారు.

    -ఎన్నం