Pawan Kalyan Varahi: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ,ఎన్నికల కోసం ఆయన తయారు చేయించిన ‘వారాహి’ వాహనం కూడా సెన్సేషనల్ గా మారింది..కొద్దీ రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఆర్మీ కలర్ తో పోలి ఉన్న రంగుతో ‘వారాహి’ వాహనం ని తయారు చేయించాడు..ఇది రాష్ట్రం లో పెద్ద వివాదానికి దారి తీసింది..అయితే ఇప్పుడు ఈ వారాహి వాహనం కి ‘కొండగట్టు’ లో ఈనెల 24 వ తేదీన పూజలు చేయించబోతున్నాడు పవన్ కళ్యాణ్.

తనకి సంబంధించి ఏ శుభకార్యక్రమం అయినా కొండగట్టు ప్రాంతం లో ఆంజనేయ స్వామిని దర్శించుకొని , పూజలు చేయించి ప్రారంభించడం పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి అలవాటు..ఎందుకంటే 2009 అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రాంతం లో ప్రచారం కి వెళ్ళినప్పుడు శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురి అయ్యాడు.
ప్రాణాలు పొయ్యే స్థితి నుండి ఆంజనేయ స్వామి కటాక్షం వలనే మళ్ళీ తిరిగి ప్రాణాలు పొందానని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో తెలిపాడు..అప్పటి నుండి ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనిదే ఏ శుభకార్యం కూడా తలపెట్టడు..ఈ నెల 24 వ తారీఖున ‘వారాహి’ కి పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తెలంగాణ జనసేన పార్టీ కార్యకర్తలతో కాసేపు సమావేశం అవుతాడు..తెలంగాణ లో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది..ఎలా మనం ముందుకెళ్లాలి అనేది కార్యకర్తలకు దిశానిర్దేశం చెయ్యబోతున్నాడు.

అదే రోజున ఆయన అన్షుద్ నరసింహ యాత్ర ని కూడా ప్రారంభించబోతున్నట్టు సమాచారం..ఈ యాత్రలో భాగంగా ఆయన 31 నరసింహ స్వామి క్షేత్రాలను సందర్శిస్తాడు..ఆ తర్వాత ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా పర్యటించడానికి కార్యాచరణ రచిస్తారు..ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో చూడాలి.