Minister Roja Unstoppable With Nbk: బాలయ్య అన్ స్టాపబుల్ షోకి రోజా…? తేల్చిచెప్పిన వైసీపీ ఫైర్ బ్రాండ్! నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 1 భారీ ఆదరణ దక్కించుకుంది. అంతకు మించిన రెస్పాన్స్ సీజన్ 2 కి దక్కుతుంది. బాలయ్య హోస్టింగ్ స్కిల్స్ తో పాటు ఆయన ఎంపిక చేస్తున్న గెస్ట్స్ దీనికి కారణం. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి రిజర్వ్డ్ పర్సన్స్ ని టాక్ షోకి తేవడం గొప్ప పరిణామం. అందులోనూ వారి కున్న అశేష ప్రజాభిమానం ఎపిసోడ్స్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెడుతుంది. ప్రభాస్ తో బాలయ్య షో రెండు ఎపిసోడ్స్ గా ప్రసారమైంది. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజు ఏకంగా సైట్ క్రాష్ అయ్యింది. గంటల కొద్దీ సేవలు నిలిచిపోయాయి.

ప్రభాస్ ఎపిసోడ్ కి మించిన హైప్ పవన్ ఎపిసోడ్ పై ఉంది. జస్ట్ ప్రోమోలే రికార్డ్స్ బద్దలు కొడుతున్నాయి. త్వరలో బాలయ్య-పవన్ ల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రసారం కానుండగా సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే వైసీపీ మంత్రి, ఒకప్పటి హీరోయిన్ రోజా అన్ స్టాపబుల్ షోకి వస్తే మజా ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ విషయం మేకర్స్ కి కూడా బాగా తెలుసు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బాలయ్య షోకి వచ్చేది లేదని రోజా తేల్చి చెప్పేశారు.
తాజాగా ఈ విషయంపై ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు. అన్ స్టాపబుల్ షోలో పాల్గొనే ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ షోలో పాల్గొన్న నేపథ్యంలో తనకు మంచి అభిప్రాయం పోయింది అన్నారు. చంద్రబాబు కోసం బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ని కూడా తక్కువ చేశాడు. ఆయన్ని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించారు. అలాంటి పొలిటికల్ అజెండాతో నడుస్తున్న షోలో నేను ఎప్పటికీ పాల్గొనను అన్నారు.

అన్ స్టాపబుల్ వేదికగా బాలయ్యను పవన్ కలవడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్ స్టాపబుల్ షోకి రానని తేల్చి చెప్పారు. గతంలో వెళ్లాలని అనుకున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో టీడీపీ-వైసీపీ మధ్య అసెంబ్లీ వేదికగా వాడి వేడి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో నేను బాలయ్యతో ఒక షోలో ముచ్చటించడం సరికాదని ఊరుకున్నాను. ఇక బాలయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. కలిసి అనేక సినిమాలు చేశామని గతంలో రోజా చెప్పారు.