Roja- Chiranjeevi: హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొనేళ్లు తెలుగు దేశం పార్టీ లో కొనసాగి ,ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాం లో కాంగ్రెస్ పార్టీ లో చేరి, ఆయన తదనంతరం వైసీపీ పార్టీ లో చేరి రెండు సార్లు MLA గా గెలిచి ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తుంది..మామూలుగానే ఈమె నోటికి ఆనకట్ట ఉండదు.

ఇక అధికారం లోకి వచ్చిన తర్వాత ఆమెని ఆపగలమా, నోటికి వచ్చినట్టు ఏది తోచితే అది మాట్లాడుతూ రోజా ఇప్పటికే జనాల్లో బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది..లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీ పై ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం రేపిందో మన అందరికి తెలిసిందే..రాజకీయాలకు దూరంగా ఉంటూ అజాత శత్రువుగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి మీద కూడా ఆమె అవాకులు చవాక్కలు పేల్చడం మెగా ఫ్యాన్స్ కి చిర్రెత్తేలా చేసింది.
ఆమె మాట్లాడిన మాటలపై మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్ గా ‘వాల్తేరు వీరయ్య’ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వూస్ లో తనదైన స్టైల్ లో స్పందించాడు..ఆయన అలా బాధపడుతూ మాట్లాడిన తర్వాత రోజా నుండి క్షమాపణలు ఊహించారు మెగా ఫ్యాన్స్..కానీ మళ్ళీ ఆమె తన నోటికి పని చెప్తూ ఏది పడితే అది మాట్లాడేసింది.

ఆమె మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ చెప్పినట్టే వినాలి..వాళ్ళు చెప్పినట్టు వినకపోతే సినిమాల్లో అవకాశాలు రావు..వాళ్ళ మీద భయం తోనే కొంతమంది అలా మాట్లాడుతారు (హైపర్ ఆది ని ఉద్దేశిస్తూ) కానీ వాళ్లంటే ప్రేమ మాత్రం కాదు..అయినా ఆ కుటుంబం వల్ల ఏమి కాదు..వాళ్లకి అంత సీన్ ఉంటే మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ని ఎందుకు గెలిపించుకోలేకపొయ్యారు..సినిమాల్లో క్రేజ్ ఉంది కదా అని ఓట్లు ఎవ్వరు వెయ్యరు..అలా వేసే పని అయితే గతంలో ఒక్కాయన(చిరంజీవి) సీఎం అయ్యేవాడు’ అంటూ రోజా మరోసారి నోరు జారింది..మరి దీనికి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.