Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ అనూహ్య నిర్ణయం.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ? ఎక్కడ నుంచి అంటే?

Pawan Kalyan: పవన్ అనూహ్య నిర్ణయం.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ? ఎక్కడ నుంచి అంటే?

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితో కలుస్తారు? ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? ఎక్కడ నుంచి పోటీచేస్తారు? ఈసారి రెండు చోట్ల పోటీచేస్తారా? లేక ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? అన్నది పార్టీలోనూ, బయట విస్తృతమైన చర్చ అయితే నడుస్తోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగినా నిరాశే ఎదురైంది. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పవన్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన పోటీచేసే నియోజకవర్గంపై మాత్రం స్పష్టత రావడం లేదు. అక్కడా? ఇక్కడా? అన్న ఊహాగానాలే తప్పించి పలానా చోట పోటీచేస్తానని పవన్ కానీ.. అటు జనసేన నేతలు కానీ ఎక్కడా చెప్పడం లేదు. కానీ పవన్ మాత్రం అటు పొత్తుల లెక్కలు ఒక కొలిక్కి వస్తే కానీ ఎక్కడ నుంచి పోటీచేసేది స్పష్టతనివ్వరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan
Pawan Kalyan

మరోవైపు పొలిటికల్ సర్కిల్ లో కొత్త టాక్ వినిపిస్తోంది. పవన్ ఎంపీ, ఎమ్మెల్యగా పోటీచేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్ సీఎం కావాలనుకుంటున్నారు. అటువంటి నాయకుడు ఎంపీగా పోటీచేస్తే..అది దేనికి సంకేతం. ఆయన సీఎం ఆశలు వదులుకున్నట్టేనా? అన్న చర్చ సహజంగా మొదలవుతుంది. పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా నిర్ణయించుకుంటారే తప్ప..లేకుంటే అటువంటి డెసిషన్ తీసుకునే చాన్సే లేదని జనసేన వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అయితే ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో నడుస్తోంది. పవన్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ పదవికి పోటీచేస్తారని ఒక టాక్ విస్తృతంగా నడుస్తోంది. పోనీ అదే నిజమైతే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీచేస్తారు? ఎంపీగా ఎక్కడ నుంచి బరిలో దిగుతారన్న ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి,

కోస్తాంధ్రలో జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే చాన్స్ ఉంది. ఇక ఎంపీకి సంబంధించి అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశముంది. తాను పోటీచేయడం ద్వారా ఆ ప్రభావం రెండు, మూడు జిల్లాలపై చూపేలా ఆయన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంపీగా పోటీచేస్తారన్న ఒక కామెంట్ బయటకు వచ్చింది. సహజంగా రాయలసీమ అంటే వైసీపీకి పట్టున్న ప్రాంతం. అక్కడ బరిలో దిగి జగన్ అండ్ కోకు గట్టి సవాల్ విసరాలని పవన్ భావిస్తున్నారు. పొత్తులు, రాజకీయ లెక్కలు చూసుకొని పవన్ స్ట్రాంగ్ డెసిషన్ వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ ను ఉదహరిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఆయన చాలాసార్లు అనంతపురం నుంచి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అటు తరువాత ఆయన కుమారుడు హరికృష్ణ, ఇప్పుడు బాలక్రిష్ణ అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఎన్టీఆర్ తరహాలో పవన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పవన్ పక్కా ప్రణాళికతో వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్లాన్ ఏ, ప్లాన్ బీలను రూపొందించి అందుకు తగ్గ అడుగులు వేయాలని భావస్తున్నారుట. ప్లాన్ ఏ ప్రకారం టీడీపీ, బీజేపీతో కలిసి వెళితే 2014 రిజల్ట్ రిపీట్ అవుతుంది. అప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ సీఎం రేసులో నిలుస్తారు. అందుకే కోస్తాంధ్ర నుంచి ఒక్క ఎమ్మెల్యే పదవికే పోటీచేస్తారు. ప్లాన్ బీ ప్రకారం టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది. అప్పుడు పవన్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీచేస్తారు. కూటమి అధికారంలోకి వస్తే చెరి సగం సీఎం పదవి పంచుకునేందుకు ఒప్పందం చేసుకుంటారు. ముందుగా చంద్రబాబుకు చాన్సిస్తారు. తాను బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏలో చేరి కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చెలాయిస్తారు. ఒప్పందం ప్రకారం సీఎం పదవి బాధ్యతలు చేపట్టాల్సి వస్తే ఎంపీ పదవిని వదులుకుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించాలన్న కసితో పనిచేస్తున్న పవన్ అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న లక్షలాది మంది అభిమానులు, జనసైనికులు ఈ నిర్ణయానికి ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper