Pawan Kalyan: తమిళనాడు అసెంబ్లీలో మార్మోగిన ‘పవన్ కళ్యాణ్’ నామస్మరణ

Pawan Kalyan: సహజంగా తెలంగాణ, ఏపీలో పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) పేరు వినిపించడం సర్వసాధారణం.. కానీ పక్కనున్న తమిళనాడులోనూ తాజాగా పవన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే పవన్ పై చర్చ జరిగిందంటే అతిశయోక్తి కాదు.. పవన్ కళ్యాణ్ గురించి చర్చించేంతగా ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా… ఇటీవలే పవన్ కళ్యాణ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరును ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశాడు. పవన్ ట్వీట్ ను తమిళనాడు ఆరోగ్యశాఖ […]

Written By: NARESH, Updated On : September 3, 2021 5:12 pm
Follow us on

Pawan Kalyan: సహజంగా తెలంగాణ, ఏపీలో పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) పేరు వినిపించడం సర్వసాధారణం.. కానీ పక్కనున్న తమిళనాడులోనూ తాజాగా పవన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే పవన్ పై చర్చ జరిగిందంటే అతిశయోక్తి కాదు.. పవన్ కళ్యాణ్ గురించి చర్చించేంతగా ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా…

ఇటీవలే పవన్ కళ్యాణ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరును ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశాడు. పవన్ ట్వీట్ ను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తమిళనాడు అసెంబ్లీలో చదివి వినిపించారు. తోటి సభ్యులకు అర్థమయ్యేలా తెలుగులో చదువుతూ.. తమిళంలో అనువదించి మరీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

తమిళనాడు సీఎం స్టాలిన్ ను అభినందిస్తూ ఇటీవల పవన్ ట్వీట్ చేసిన సంగత తెలిసిందే.. ‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్కరాష్ట్రానికే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం .. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ను ఉద్దేశించి పవన్ ఈ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ తమిళనాడు అసెంబ్లీలో చదవి స్టాలిన్ గొప్పతనాన్ని పక్క రాష్ట్రం వారు అభినందిస్తున్నారని.. దేశమంతా ఫాలో కావాలని అంటున్నారు ఆర్థిక మంత్రి సుబ్రహ్మణియన్ కొనియాడారు. ఇటీవలే చిరంజీవి సైతం చెన్నై వెళ్లి స్టాలిన్ ను అభినందించిన సంగతి తెలిసిందే..

https://twitter.com/ganeshbandla/status/1433684565583806469?s=20