NTR EMK SHOW : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు.. రేటింగ్ చూసి అంతా షాక్!

జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు’ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగ‌స్టు 22న కర్టెన్ రైజర్ షోతో మొద‌లైన ఈ గేమ్ షోకు.. గెస్టుగా వ‌చ్చాడు రామ్ చరణ్. ఆద్యంతం ఆస‌క్తిగా సాగిన ఈ మ‌ల్టీ స్టార‌ర్ గేమ్‌.. అభిమానుల‌తోపాటు ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది. అయితే.. తొలి రోజు వ‌చ్చిన రేటింగ్ చూసి అంద‌రూ అవాక్క‌వుతున్నారు. మ‌రి, ఆ వివ‌రాలేంటో మీరూ చూసేయండి. అప్పటి వరకూ సక్సెస్ ఫుల్ హీరోగా మాత్రమే గుర్తింపు పొందిన […]

Written By: Bhaskar, Updated On : September 4, 2021 11:12 am
Follow us on

జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు’ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగ‌స్టు 22న కర్టెన్ రైజర్ షోతో మొద‌లైన ఈ గేమ్ షోకు.. గెస్టుగా వ‌చ్చాడు రామ్ చరణ్. ఆద్యంతం ఆస‌క్తిగా సాగిన ఈ మ‌ల్టీ స్టార‌ర్ గేమ్‌.. అభిమానుల‌తోపాటు ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది. అయితే.. తొలి రోజు వ‌చ్చిన రేటింగ్ చూసి అంద‌రూ అవాక్క‌వుతున్నారు. మ‌రి, ఆ వివ‌రాలేంటో మీరూ చూసేయండి.

అప్పటి వరకూ సక్సెస్ ఫుల్ హీరోగా మాత్రమే గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ ప్రారంభ సీజ‌న్ కు హోస్టుగా వ్య‌వ‌హ‌రించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంతేకాదు.. ఆ షోను స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేసి శ‌భాష్ అనిపించుకున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు హోస్టుగా వ‌చ్చారు. అయితే.. గ‌తంలో స్టార్ మాలో ప్ర‌సార‌మైన ఈ షో హ‌క్కుల‌ను ఇప్పుడు జెమినీ టీవీ సొంతం చేసుకుంది. మా టీవీలో మూడు సీజ‌న్ల‌కు నాగార్జున‌, నాలుగో సీజ‌న్ కు మెగాస్టార్ హోస్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత స్టార్ మా ఆ షోను నిలిపేసింది. ఇప్పుడు జెమినీ టీవీ కొత్త‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ తో లాంచ్ చేసింది.

ఎన్టీఆర్ హోస్టుగా ఉండ‌డం.. తొలి ఎపిసోడ్ కు రామ్ చ‌ర‌ణ్ రావ‌డంతో ఈ షోపై హైప్ పెరిగింది. అటు నంద‌మూరి, ఇటు మెగా అభిమానులు టీవీల‌కు అతుక్కుపోయారు. దీంతో.. ఈ షోకు భారీ రేటింగ్ వ‌చ్చింది. అంత‌కు ముందు న‌డిచిన‌ సీజ‌న్ల‌క‌న్నా భారీగా రేటింగ్ వ‌చ్చింది. ఆగ‌స్టు 22, 23 తేదీల్లో ప్ర‌సార‌మైన క‌ర్ట‌న్ రైజ‌ర్ షోకు సంబంధించిన రేటింగ్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కు 11.40 టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింది. ఇది ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు షో చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక రేటింగ్‌.

ఈ షో మొద‌టి మూడు సీజ‌న్ల‌కు నాగార్జున హోస్టుగా ఉన్నారు. తొలి సీజ‌న్ కు అత్య‌ధికంగా 9.70 రేటింగ్ వ‌చ్చింది. రెండో సీజ‌న్ కు 8.20, మూడో సీజ‌న్ కు 6.72 రేటింగ్ వ‌చ్చింది. చిరంజీవి న‌డిపించిన నాలుగో సీజ‌న్ కు మాత్రం 3.65 శాత‌మే రేటింగ్ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు జూనియ‌ర్ హోస్టుగా, చ‌ర‌ణ్ గెస్టుగా వ‌చ్చిన ఎపిసోడ్ కు ఏకంగా 11.40 రేటింగ్ వ‌చ్చింది.

వీళ్లిద్ద‌రూ క‌లిసి ఆర్ ఆర్ ఆర్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఈ సినిమా ఆరంభం నుంచీ ఈ జోడీపై భారీ హైప్ క్రియేట్ అయి ఉంది. త‌ర‌చూ వీరి మ‌ల్టీస్టార‌ర్ విష‌యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇలాంటి వీరిద్ద‌రూ క‌లిసి క‌ర్ట‌న్ రైజ‌ర్ షోలో పాల్గొన‌డంతో భారీ రేటింగ్ వ‌చ్చింది. అయితే.. బిగ్ బాస్ షోను మాత్రం దాట‌లేక‌పోయింది. క‌నీసం ద‌గ్గ‌రికి కూడా చేర‌లేదు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కాంబోలో షో కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా 15 వ‌ర‌కు టీఆర్పీ వ‌స్తుంద‌ని భావించారు. కానీ.. 11.40 వ‌ద్ద‌నే ఆగిపోయింది. బిగ్ బాస్ షో హ‌య్యెస్ట్ రేటింగ్ 18 కావ‌డం విశేషం.