నటీనటులు: అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ తదితరులు
దర్శకుడు: రాచకొండ విద్యాసాగర్
నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
సంగీత దర్శకుడు: శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రఫీ: రామ్
ఎడిటర్: కిరణ్ గంటి
అవసరాల శ్రీనివాస్, రుహని శర్మ లు హీరో హీరోయిన్ లుగా కలిసి నటించిన తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు (Nootokka Jillala Andagadu). ఈ చిత్రంకి రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ (Review) చూద్దాం.
కథ :
గుత్తి సూర్యనారాయణ (అవసరాల శ్రీనివాస్)కి చిన్న వయసులోనే బట్టతల వస్తోంది. ఆ బట్టతల విషయం ఎవరికి తెలియకుండా మ్యానేజ్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఇందులో భాగంగా విగ్గు లేకుండా అసలు ఉండలేదు. ఇలాంటి సూర్యనారాయణ జీవితంలోకి అంజలి (రుహాని శర్మ) వస్తోంది. తన బట్టతల విషయం దాచి అంజలితో ట్రావెల్ చేస్తూ ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అంజలికి సూర్యనారాయణ బట్టతల గురించి తెలుస్తోంది. దానికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ? చివరకు సూర్యనారాయణ – అంజలి ఒకటి అవుతారా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమాలో బట్టతల తాలూకు సీన్స్, అలాగే బట్టతలకు సంబంధించిన కొన్ని అంశాలు సినిమాలో కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అవసరాల శ్రీనివాస్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన బట్టతలను దాచే ప్రయత్నంలో వచ్చే సన్నివేశాల్లో అవసరాల శ్రీనివాస్ చాల బాగా నటించాడు.
అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో కూడా శ్రీనివాస్ చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చారు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో అవసరాల సరసన రుహాని శర్మ కథానాయికగా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక కీలక పాత్రలో నటించిన రోహిణి తన ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్ తో సినిమాలో కనిపించనంత సేపు ఆమె అలరించింది. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సినిమాలో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా సినిమా మాత్రం ఏ మాత్రం ఇంట్రస్ట్ కలిగించలేని సన్నివేశాలతో ప్లే బాగా బోర్ గా సాగుతూ మొత్తానికి సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథలో మిళితమయి సాగవు. పైగా కథనంలో సరైన ప్లో లేదు. ఇక కొన్ని నవ్వించే ప్రయత్నం చేసారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించటానికి చేసినట్లే ఉంటుందిగాని సహజంగా ఉండదు.
ప్లస్ పాయింట్స్ :
అవసరాల శ్రీనివాస్ నటన,
కథ,
కొన్ని కామెడీ సీన్స్,
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్,
బోరింగ్ ప్లే,
ఇంట్రెస్ట్ లేని సీన్స్,
లవ్ ట్రాక్,
సినిమా చూడాలా? వద్దా ?
‘నూటొక్క జిల్లాల అందగాడు’ అంటూ సీరియస్ పాయింట్ లో కామెడీ సీన్స్ తో మరియు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉన్న కథాంశంతో సాగిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. అయితే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.
రేటింగ్: 2.25/5