Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : కోనసీమ ఉద్రిక్తతలకు కారణం వారే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : కోనసీమ ఉద్రిక్తతలకు కారణం వారే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan కోనసీమ జిల్లా పేరుతో అమలాపురం అంటుకుంది. అక్కడి ఓ వర్గం వారు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. ఏకంగా మంత్రి విశ్వరూప్ , వైసీపీ ఎమ్మెల్యే ముమ్మడివరం సతీష్ ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురం అట్టడికింది. ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని.. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ స్పష్టం చేశారు.

అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని జనసేనాని నిప్పులు చెరిగారు.. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారని పవన్ విమర్శించారు.

ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానన్నారు.

వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండని హితవు పలికారు.
Recommended videos
కోనసీమ కోసం రంగంలోకి దిగిన పవన్ | Pawan Kalyan at Gannavaram Airport | Dr Br Ambedkar Konaseema Dist
కోడి కత్తి కేసు ఎక్కడి దాకా వచ్చింది.? | Pawan Kalyan Questions Home Minister |Jagan Kodi Kathi Case
అంబేద్కర్ ని రాజకీయంగా వాడుకుంటున్నారు || Pawan Kalyan Comments on Konaseema Dist Issue

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version