Venkatesh: ‘ఎఫ్ 3’ సినిమాలో నటించందుకు గానూ వెంకటేష్ అక్షరాలా రూ.15 కోట్లు తీసుకున్నాడు. అందుకే వెంకీ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మరి ఆ కామెంట్స్ ఏమిటో వెంకీ మాటల్లోనే విందాం.

నా గత రెండు సినిమాలు నారప్ప, దృశ్యం-2 ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. దాంతో రెండేళ్ల తర్వాత నేను థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నాను. ముఖ్యంగా ఎఫ్-3 థియేటర్స్ లో మాత్రమే చూడాల్సిన సినిమా. అందుకే, ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమా అద్భుతమైన హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు.
Also Read: Minister Botsa Satyanarayana: మారిన బొత్స తీరు.. అసలు కారణం అదేనా?
ఇక నాకు కామెడీ అంటే బాగా ఇష్టం. నేను స్నేహితుల దగ్గర, అలాగే.. ఇంట్లో కూడా జోకర్ గానే ఉండటానికి ఇష్టపడతాను. డైరెక్టర్ అనిల్ రావిపూడి రైటింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఈవీవీ గారి మాదిరే అనిల్ కూడా కామెడీని చాలా బాగా పండిస్తాడు. ఎఫ్-3లో కూడా అనిల్ కామెడీ చాలా బాగుంటుంది. పైగా ఈ సినిమా కోసం నేను డిఫరెంట్ వాయిస్ ను యూజ్ చేశాను.

‘ఎఫ్ 3′ ఏ స్థాయిలో హిట్ అవుతుందో నేను చెప్పలేను కానీ.. ఎఫ్ 2 కంటే హిలేరియస్‌గా ఉంటుంది. నేను ఫలానా జానర్ సినిమాలే చేయాలని ఏమి అనుకోలేదు. ఆడియన్స్ కు ఏం ఇష్టమో అది ఇస్తే చాలు. అయితే, కోవిడ్ తర్వాత ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది అనేది వాస్తవం. అందుకే, రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశాను. చాలా చాలెంజింగ్ అనిపించింది.
అందరూ ఆశ్చర్యపోయే మరో అప్ డేట్ ఏమిటంటే.. సల్మాన్ ఖాన్ సినిమాలో బ్రదర్ పాత్రని పోషిస్తున్నాను. అసలు మల్టీస్టారర్ సినిమాలకు నేను ఎప్పటికీ రెడీగానే ఉంటాను. మంచి కథ దొరికితే నేను ఏ హీరోతోనైనా కలిసి నటిస్తాను’ అంటూ వెంకీ చెప్పుకొచ్చాడు.
Also Read: Janhvi Kapoor: ‘జాన్వీ కపూర్’ కిల్లింగ్ లుక్.. అలా చేతులు వెనక్కి పెట్టి.. ఒళ్ళు విరవడం.. !


