Parliament Elections 2024 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న దేశంలో రెండు దశ పోలింగ్ జరుగనుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు, తమ వ్యాపారం లాభసాటిగా సాగేందుకు కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని వ్యాపార సంస్థలు కొత్త ఆలోచనకు తెరలేపాయి. ఓటు వేసి డిస్కౌంట్ పట్టు అంటూ ఆఫర్లు ప్రకటించాయి. ఎన్నికలను ఆఫర్ల సీజన్‌గా మార్చేశారు. ఎన్నికల సంఘం పోలింగ్ రోజు సెలవు ప్రకటిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో చాలా మంది పోలింగ్ డేను హాలీగా భావిస్తున్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. పట్టణ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌లోని పలువురు వ్యాపారులు. ఓటువేసి తమకు సిరా చుక్క చూపిస్తే డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, ర్యాపిడో సంస్థతోపాటు పలు క్యాబ్ సంస్థలు ముందుకు వచ్చాయి.
హోటళ్లలో 10 శాతం డిస్కౌంట్..
ఓటింగ్ శాతాన్ని పేంచేందుకు కర్ణాటకలోని బెంగళూరుతోపాటు పలు పట్టణాల్లోని హోటళ్లు, ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, లక్నోతోపాటు పలు పెద్ద పట్టణాలో హోటళ్లు ఓటేసే వారికి 10 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించాయి. టిఫిన్‌తోపాటు భోజనాలపై కూడా ఈ ఆఫర్ ప్రకటించాయి. ఇది ఏప్రిల్ 26వ తేదీ ఒక్కరోజు మాత్రమే అమలులో ఉంటాయని తెలిపాయి.
ఆస్పత్రుల్లో కూడా..
ఇక బెంగళూరు, నోయిడాలోని ఆస్పత్రులు కూడా ఓటింగ్ పెంచేందుకు డిస్కౌంట్ ఆఫర్‌తో ముందుకు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లోని ఓ వైద్యుడు కన్సల్టేషన్ ఫీజులో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. పలు ఆస్పత్రులు హెల్త్ చెకప్ ఫీజులపై రాయితీ ఇస్తామని ముందుకు వచ్చాయి. ఎక్స్‌రే, ఎంఆర్ఐ లాంటీ టెస్టులపై కూడా 20 శాతం తగ్గింపు ఇస్తున‍్నట్లు ప్రకటించాయి. కొన్ని ఆస్పత్రులు ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తామని ప్రకటించాయి.
ఇంకా వీటిపై కూడా..
– బెంగళూరులోని కొన్ని బంగారం షాపులు ఓటేసే వారికి బంగారు ఆభరణాల మేకింగ్ చార్జిపై డిస్కౌంట్ ప్రకటించాయి.
– ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు కూడా ఓటేసేవారికి లీటర్ పెట్రోల్‌పై 10 శాతం తగ్గింపు ఇస్తామని ముందుకు వచ్చాయి. చిన్న వ్యాపారులు సైతం ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు.
– బెంగళూరులోని కొన్ని సంస్థలు క్యాబ్ ఫ్రీ ఆఫర్ ప్రకటించాయి. కొన్ని రెస్టారెంట్లు బీర్ ఫ్రీ అని ప్రకటించాయి.