https://oktelugu.com/

Pat Cummins : SRH కెప్టెన్ మామూలోడు కాదు.. పవన్, బన్నీ, మహేష్ అభిమానులు ఫిదా

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొడుతున్నది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఈసారి ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2024 / 10:22 PM IST

    SRH captain who emulated Pawan, Bunny and Mahesh

    Follow us on

    Pat Cummins : డేవిడ్ వార్నర్ తెలుసు కదా..ఆ ఆస్ట్రేలియా ఆటగాడు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో డైలాగులను తెలుగులో చెప్తాడు. వారిని అనుకరిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటాడు. ముఖ్యంగా పుష్ప సినిమాకు డేవిడ్ వార్నర్ తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. డేవిడ్ వార్నర్ తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో ఫేమస్ అయ్యేందుకు హైదరాబాద్ ఐపీఎల్ జట్టు కెప్టెన్ కమిన్స్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక వీడియోనే నిదర్శనం.

    ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొడుతున్నది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఈసారి ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జట్టు తమ ఆటగాళ్లతో తెలుగులో ప్రాచుర్యం పొందిన సినిమాల్లోని డైలాగులను చెప్పిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ చెప్పిన డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

    పవన్ కళ్యాణ్ స్టైల్ తో కమిన్స్ అల్లు అర్జున్, మహేష్ బాబు డైలాగులు చెప్పి అలరించాడు కమిన్స్. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది . మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అనే డైలాగును కమిన్స్ తనదైన స్టైల్ లో చెప్పి అలరించాడు. పుష్ప సినిమాలోని డైలాగ్ కూడా అదే స్థాయిలో చెప్పాడు కమిన్స్. ” కమిన్స్ అంటే క్లాస్ కాదు. ఊర మాస్.. సన్ రైజర్స్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్” అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్మీ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగా.. ట్రెండింగ్ గా మారింది.. అభిమానులు ఈ వీడియో చూసి కమిన్స్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.