https://oktelugu.com/

Sunil : సునీల్ హీరో అంటే రాజమౌళికే నో చెప్పిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు వీరే…

ఇక మొత్తానికైతే మర్యాదరామన్న లాంటి ఒక హిట్టు సినిమాను ఇద్దరు స్టార్ హీరోయిన్లు మిస్ చేసుకున్నారు. ఇక సలోనికి మాత్రం ఈ సినిమాతో సాలిడ్ హిట్టు లభించినప్పటికీ ఆమె కూడా ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్ సినిమాలను చేసి ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ ఔట్ అయిపోవాల్సి వచ్చింది...

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2024 / 10:33 PM IST

    Sunil's hero means two star heroines who said no to Rajamouli

    Follow us on

    Sunil : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలను తీసి దర్శక ధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతూ తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ సాధించడమే కాకుండా ఆయా హీరోలకి ఇండస్ట్రీ హిట్లను కూడా అందించాయి. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయన వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ఇక ఇదిలా ఉంటే ఆయన మగధీర లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత సునీల్ లాంటి ఓ కమెడియన్ ని పెట్టుకొని ‘మర్యాద రామన్న’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా స్టోరీ డిస్కషన్ లో ఉన్న సమయంలోనే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లను తీసుకోవాలని రాజమౌళి అనుకున్నాడు. ఇక అందుకోసమే అనుష్క, త్రిష లాంటి స్టార్ హీరోయిన్లను సంప్రదించినప్పటికి ఇద్దరు హీరోయిన్లు మొదట చేస్తానని హామీ ఇచ్చారట. కానీ చివరి నిమిషంలో సునీల్ హీరో అని తెలియడంతో ఇద్దరు హ్యాండ్ ఇచ్చినట్టుగా సునీల్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

    అయితే సునీల్ లాంటి కమెడియన్ తో సినిమాలు చేస్తే వాళ్ళ స్టార్ డమ్ తగ్గిపోతుందని అలాగే పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే వీళ్లు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టుగా రాజమౌళికి చెప్పారట. ఇక దాంతో వీళ్ళ ప్లేస్ లో రాజమౌళి సలోని ని తీసుకొని ఈ సినిమాలో హీరోయిన్ గా సెట్ చేశాడు. ఈ సినిమా అప్పుట్లోనే 40 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి కొద్ది సంవత్సరాల పాటు సునీల్ హీరోగా నిలబడడానికి బాగా హెల్ప్ చేసిందనే చెప్పాలి.

    ఇక మొత్తానికైతే మర్యాదరామన్న లాంటి ఒక హిట్టు సినిమాను ఇద్దరు స్టార్ హీరోయిన్లు మిస్ చేసుకున్నారు. ఇక సలోనికి మాత్రం ఈ సినిమాతో సాలిడ్ హిట్టు లభించినప్పటికీ ఆమె కూడా ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్ సినిమాలను చేసి ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ ఔట్ అయిపోవాల్సి వచ్చింది…