https://oktelugu.com/

పీసీపీ పోస్టు కోసం సీనియర్ల పంచాయితీ!!

దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. రాష్ట్రంలో అయితే గ్రేటర్‌‌ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ నడిపించేందుకు సరైన నాయకుడు లేడనే భావన జనాల్లో బలంగా వినిపిస్తోంది. అయినా నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తామే సీనియర్లమంటూ పీసీసీ చీఫ్ పోస్టు కోసం కొట్లాడుతున్నారు. Also Read: కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తున్న బీజేపీ పార్టీ ఫెయిల్యూర్‌‌కు ఉత్తమే కారణమా..? రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 6, 2020 / 01:18 PM IST
    Follow us on


    దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. రాష్ట్రంలో అయితే గ్రేటర్‌‌ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ నడిపించేందుకు సరైన నాయకుడు లేడనే భావన జనాల్లో బలంగా వినిపిస్తోంది. అయినా నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తామే సీనియర్లమంటూ పీసీసీ చీఫ్ పోస్టు కోసం కొట్లాడుతున్నారు.

    Also Read: కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తున్న బీజేపీ

    పార్టీ ఫెయిల్యూర్‌‌కు ఉత్తమే కారణమా..?

    రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీని డిపాజిట్ల కోసం పోరాడాల్సిన స్థితి తెచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన సీఎం కేసీఆర్ కోవర్టని.. కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టిబొమ్మలు దహనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దుబ్బాక, గ్రేటర్‌ ఫలితాల తర్వాత ఒక తప్పదని భావించిన ఆయన హైకమాండ్‌కు రిజైన్‌ లెటర్‌‌ పంపారు. తన స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.

    పోటీ పడుతున్న సీనియర్లు

    ఉత్తమ్‌ రాజీనామాతో ఎవరిని పీసీసీ చీఫ్ గా నియమించినా.. పార్టీని కాపాడుకుందామని ఆలోచన చేయాల్సిన సీనియర్లు సొంత లాభం చూసుకుంటున్నారు. పీసీసీ తమకే ఇవ్వాలని హైకమాండ్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఆ పోస్టులో రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయ్యిందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే పార్టీ సీనియర్‌‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల, వీహెచ్ వంటి నేతలు సైతం సీనియర్లకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని హైకమాండ్‌కు రిక్వెస్ట్‌ చేస్తున్నారు. షబ్బీర్ అలీ, మల్లు రవి, బలరాం నాయక్ వంటి నేతలు మాత్రం రేవంత్‌కే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

    Also Read: టీఆర్‌‌ఎస్‌కు ఎదురు గాలి

    క్యాడర్ కూడా రేవంత్‌కే మద్దతు

    క్యాడర్‌‌ మద్దతు కూడా రేవంత్‌ రెడ్డికే ఉండడంతో హైకమాండ్‌కు ఆయనవైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్లారిటీకి వచ్చిన ఢిల్లీ పెద్దలు సీనియర్లు మీడియాకు ఎక్కవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం రేవంత్ రెడ్డి తప్ప మరొకరిని పీసీసీ సీటులో ఊహించుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ కాదని ఇతరులకు అవకాశం ఇస్తే మాత్రం.. తెలంగాణలో తట్టబుట్ట సర్దుకోవాల్సిందేనని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్