https://oktelugu.com/

తమిళనాడు కాంగ్రెస్ కు బిగ్ షాక్..!

దేశంలో కాంగ్రెస్కు ఇప్పటికే గడ్డు పరిస్థతి ఏర్పడింది. తాజాగా తమిళనాడులోనూ పార్టీకి షాక్ తగిలినట్లయింది. ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ ఏ గోపన్న ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం అళగిరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 6, 2020 / 01:15 PM IST
    Follow us on

    దేశంలో కాంగ్రెస్కు ఇప్పటికే గడ్డు పరిస్థతి ఏర్పడింది. తాజాగా తమిళనాడులోనూ పార్టీకి షాక్ తగిలినట్లయింది. ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ ఏ గోపన్న ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం అళగిరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆయనతో తరుచూ పార్టీ నాయకులు కలుస్తున్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన మొదలైంది. కొందరు లక్షణాలు ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.