Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson not getting justice: టీమిండియాను గెలిపించినా.. సంజు, తిలక్ వర్మకు ఇంకా న్యాయం...

Sanju Samson not getting justice: టీమిండియాను గెలిపించినా.. సంజు, తిలక్ వర్మకు ఇంకా న్యాయం జరగలేదా!

Sanju Samson not getting justice: టి20 వరల్డ్ కప్ లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. టీమిండియా గెలిచి చూపించింది. టీమిండియా సెమీఫైనల్ చేరుకోవాలంటే.. గెలవాల్సిన మ్యాచ్లో.. అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఏకంగా 195 పరుగులు చేసింది.

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇంతవరకు 196 రన్స్ టార్గెట్ చేజ్ చేసిన చరిత్ర లేదు. కానీ, దానిని టీమిండియా చేసి చూపించింది. సంజు (97*) దూకుడు.. తిలక్ వర్మ (27) వీరోచితం వల్ల మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

టీమిండియా విజయం సాధించగానే.. ఆ విజయంలో సంజు శాంసన్ ముఖ్య భూమిక పోషించడంతో.. అతని గురించి సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సంజు, తిలక్ వర్మ గురించి ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంచలన విషయాలను కూడా బయటపెట్టాడు.

ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. జట్టులో జరుగుతున్న అంతర్గత పరిణామాలను బయటపెడుతుంటాడు. కీలకమైన విషయాలను వెల్లడిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం నాటి మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచిన తర్వాత సంజు శాంసన్, తిలక్ వర్మ గురించి ఇర్ఫాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు… ఆ వీడియోను అతడు తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశాడు.

Also Read: సంజు శాంసన్.. ఒంటి చేత్తో గెలిపించిన ఈ వీరుడి వెనుక.. ఇంతటి బాధ ఉంది!

“సంజు శాంసన్, తిలక్ వర్మకు ఇంతవరకు న్యాయం జరగలేదు. కానీ ఈసారి వారు న్యాయం చేశారు. సరిగా ఆడటం లేదని సంజు శాంసన్, తిలక్ వర్మ ను పక్కన పెట్టారు. అవకాశాలు ఇచ్చి దూరం పెట్టారు. అయినప్పటికీ వారిద్దరూ ధైర్యాన్ని కోల్పోలేదు. జట్టు కోసం నిలబడ్డారు. బలమైన అడుగులు వేశారు. స్థిరంగా పరుగులు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఎలా ఆదుకోవాలో చేతల్లో చేసి చూపించారు. కీలకమైన ఆటగాళ్లు విఫలమయ్యారు. అయినప్పటికీ వీరిద్దరూ తమకు మించిన బాధ్యతను మోశారు.. అందువల్లే టీమిండియా విజయం సాధించిందని” ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.

ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. జట్టులో ఉన్న పరిస్థితిని ఇర్ఫాన్ పఠాన్ బయటపెట్టాడని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ కళ్ళు తెరవాలని.. ప్రతిభను గుర్తించి సంజు లాంటి ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలని. సముచిత స్థానం కల్పించాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version