https://oktelugu.com/

సీన్ రివర్స్‌.. సెటిలర్ల మద్దతు గులాబీకే..!

కోపమైనా.. ధ్వేషమైనా ఎక్కు కాలం ఉండదంటారు. గ్రేటర్‌‌ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. ఉద్యమ సమయంలో టీఆర్‌‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్రా సెటిలర్లు ఆ పార్టీకే మద్దతిచ్చారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సైతం గులాబీ పార్టీకే ఓటు వేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఇందుకు నిదర్శనం Also Read: ‘గ్రేటర్’ను ఏలనున్న మహిళామణులు.. వీరి సంఖ్య ఎంతంటే? టీడీపీ పోటీ చేసినా.. సెటిటర్లు ఎక్కువగా ఉన్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 6, 2020 / 01:30 PM IST
    Follow us on


    కోపమైనా.. ధ్వేషమైనా ఎక్కు కాలం ఉండదంటారు. గ్రేటర్‌‌ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. ఉద్యమ సమయంలో టీఆర్‌‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్రా సెటిలర్లు ఆ పార్టీకే మద్దతిచ్చారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సైతం గులాబీ పార్టీకే ఓటు వేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఇందుకు నిదర్శనం

    Also Read: ‘గ్రేటర్’ను ఏలనున్న మహిళామణులు.. వీరి సంఖ్య ఎంతంటే?

    టీడీపీ పోటీ చేసినా..

    సెటిటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ.. ఎవరికీ డిపాజిట్లు కూడా రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బహిరంగ మద్దతు తెలిపిన వైసీపీ.. గ్రేటర్‌‌లో మాత్రం సైలెంట్‌గా ఉన్నది. కానీ, లోపకాయిరీ ఒప్పదం చేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ సారి బీజేపీ బలంగా ఉండడంతో కేంద్రంలో సంబంధాలపై ఎఫెక్ట్‌ పడుతుందనే ఉద్దేశంతో వైసీపీ బయటికి రాలేదని తెలుస్తోంది. సీమాంధ్రులు ఎక్కువగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ఎక్కువగా డివిజన్లు గెలవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

    టీఆర్‌‌ఎస్‌ సక్సెస్‌ వెనక వైపీసీ

    సైటిలర్స్‌ ప్రాంతాల్లో టీఆర్‌‌ఎస్‌ సక్సెస్ వెనుక ఏపీలోని అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు ఏపీ నేతలు ఫోన్లు చేసి మరీ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారంట. హైదరాబాద్‌లో చాలామంది వ్యాపారాలు కూడా ఉండడంతో రూలింగ్‌ పార్టీతో వివాదం ఎందుకని చెప్పిట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బీజేపీ నేతలకు సమాచారం వెళ్లడంతో సీనియస్‌గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    Also Read: టీఆర్‌‌ఎస్‌కు ఎదురు గాలి

    హైకమాండ్‌కు కంప్లైంట్‌!

    కొన్ని చోట్ల రెడ్డి పరివార్ చేసిన సాయానికి గుర్తుగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు , టీఆర్‌‌ఎస్‌కు వైసీపీ మద్దతు తెలిసిన కొన్ని ఆధారాలతో తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ హైకమాండ్ కు కంప్లైట్‌ చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీలో నువ్వా.. నేనా.. అని కొట్లాడుకునే టీడీపీ, వైపీసీలు తెలంగాణలో టీఆర్‌‌ఎస్‌కు సహకరించడం మాత్రం ఆశ్చర్చమే.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్