మీకు తెలుసా.. రాష్ట్రంలో ఓపి సేవలు ప్రారంభం!

కరోనా విజృంభన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మాత్రమే అందుతుండగా బుధవారం నుంచి ఓపి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల ఆయా ఆసుపత్రులు ఖాళీగా దర్శనమిచ్చాయి. హైద్రాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ బయటి రోగుల విభాగం సేవలు మొదలైనాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో సుమారు 45 రోజుల తర్వాత ప్రభుత్వం లాక్‌ డౌన్‌ లో మార్పులు చేసింది. దీంతో ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 2:43 pm
Follow us on

కరోనా విజృంభన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మాత్రమే అందుతుండగా బుధవారం నుంచి ఓపి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల ఆయా ఆసుపత్రులు ఖాళీగా దర్శనమిచ్చాయి.

హైద్రాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ బయటి రోగుల విభాగం సేవలు మొదలైనాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో సుమారు 45 రోజుల తర్వాత ప్రభుత్వం లాక్‌ డౌన్‌ లో మార్పులు చేసింది. దీంతో ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు బయట రోగుల సేవలను అందుబాటులోకి తెచ్చాయి. లాక్‌ డౌన్ సమయంలో 90 శాతం ఆసుపత్రులు వైద్యసేవలకు బంద్ పెట్టగా, కొన్ని అత్యవసర సేవలను మాత్రమే అందించాయి.

అయితే కొన్ని జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఓపి సేవలు ప్రారంభించలేదని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. మరోవైపు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆటోలు, క్యాబ్‌ లు తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా సాధారణ చెకప్ చేసుకునే వారు ఈ ట్రాన్స్‌పోర్టులను వినియోగించి ఆసుపత్రుల బాటపట్టారు. దీంతో కొన్ని ఆసుపత్రుల్లో ఓపి ఒక్కసారిగా పెరుగగా, మరి కొన్ని ఆసుపత్రులు ఖాళీగానే దర్శనమిచ్చాయి. ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లకు అనుసంధానమై కొన్ని రెడ్ జోన్ జిల్లాలు ఉండటం వలన ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో అక్కడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు.

మరోవైపు చాలా మందికి ఆసుపత్రుల్లో ఓపి సేవలు ప్రారంభమయ్యాయని తెలియదు. కొన్ని ప్రాంతాల్లో ఓపిలు తెరచినా, కౌంటర్లు ఖాళీగానే కనిపించాయి. అయితే పల్లే ప్రాంతాలతో పోలిస్తే, పట్ణణ ప్రాంతాల్లో ఓపి సేవల కొరకు రోగులు క్యూ కట్టారని ఓ వైద్య ఉన్నతాధికారి తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోయినా, చాలా మంది సొంత వాహనాల మీద ఆసుపత్రులకు తరలివెళ్లారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల ఆసుపత్రుల్లో మాత్రం సేవలు ప్రారంభమై కేవలం ఒక్క రోజు మాత్రమే కావడంతో ప్రజలకు అవగాహన రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఓపి కొరకు ప్రజలు సందర్శించలేదు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో క్లినిక్‌లు, చిన్న తరహా ఆసుపత్రులు ఇంకా ప్రారంభం కాలేదు.  హైదరాబాద్ పట్టణంలో దాదాపు 85 శాతం ఆసుపత్రులు ప్రారంభం అయినా, కేవలం సిటీకి చెందిన వారు మాత్రమే ఆసుపత్రుల్లో సేవలు పొందారు. ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడంతో వివిధ జిల్లాల నుంచి నిత్యం వచ్చే రోగులు రాలేకపోయారు. దీంతో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సైతం వెలవెలబోయాయి.