https://oktelugu.com/

వైజాగ్ గ్యాస్ లీక్.. ఎనిమిదికి చేరిన మరణాల సంఖ్య!

విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో లీకైన కెమికల్ గ్యాస్ పీల్చి ఇప్పటివరకు 8 మంది మరణించారు. అందులో ఒక చిన్నారి కూడా ఉండటం బాధాకరం.ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది. గ్యాస్ లీక్ ఘటన వివరాలను హోం శాఖ అధికారులు  తెలుసుకుంటున్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన సహాయ చర్యల్లో భాగంగా అంబులెన్సులు, మెడికల్ కిట్లతో భారత నౌకదళం రంగంలోకి దిగింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 7, 2020 2:17 pm
    Follow us on

    విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో లీకైన కెమికల్ గ్యాస్ పీల్చి ఇప్పటివరకు 8 మంది మరణించారు. అందులో ఒక చిన్నారి కూడా ఉండటం బాధాకరం.ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది. గ్యాస్ లీక్ ఘటన వివరాలను హోం శాఖ అధికారులు  తెలుసుకుంటున్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన సహాయ చర్యల్లో భాగంగా అంబులెన్సులు, మెడికల్ కిట్లతో భారత నౌకదళం రంగంలోకి దిగింది.

    అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్ ఆర్. వెంకటాపురంలో గ్యాస్ లీకేజీ కారణంగా పలువురికి అస్వస్థత. ఆర్ఆర్. వెంకటాపురంలోని కాల్పలో పడి ఇద్దరు, బావిలో పడి ఒకరు మృతి చెందారు. కెజీహెచ్ క్యాజువాల్టీలో ముగ్గురు, ఆర్పీ వార్డులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.