విశాఖ గ్యాస్ లీక్ కు రాజకీయ ప్రాపకమే కారణమా!

మొత్తం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విశాఖపట్నంలోని ఎల్ జి పొలిమెర్స్ లో జరిగిన గ్యాస్ లీక్ కు బలమైవున్న రాజకీయ ప్రాపకమే కారణమని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒక ప్లాస్టిక్ పరిశ్రమకు లాక్ డౌన్ మొదటి దశ పూర్తయిన తర్వాత `అత్యవసర పరిశ్రమ’గా పరిగణిస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు ఏ విధంగా అనుమతి ఇచ్చినదని ప్రముఖ పర్యావరణ వేత్త, రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి ఇ ఎ ఎస్ శర్మ ప్రశ్నించారు. బలమైన ప్రాబల్యం లేకుండా […]

Written By: Neelambaram, Updated On : May 7, 2020 2:48 pm
Follow us on


మొత్తం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విశాఖపట్నంలోని ఎల్ జి పొలిమెర్స్ లో జరిగిన గ్యాస్ లీక్ కు బలమైవున్న రాజకీయ ప్రాపకమే కారణమని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒక ప్లాస్టిక్ పరిశ్రమకు లాక్ డౌన్ మొదటి దశ పూర్తయిన తర్వాత `అత్యవసర పరిశ్రమ’గా పరిగణిస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు ఏ విధంగా అనుమతి ఇచ్చినదని ప్రముఖ పర్యావరణ వేత్త, రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి ఇ ఎ ఎస్ శర్మ ప్రశ్నించారు.

బలమైన ప్రాబల్యం లేకుండా ఈ పరిశ్రమను తెరిచేందుకు అనుమతి లభించి ఉండెడిది కాదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్రాసిన లేఖలో ఆరోపించారు. ఈ ప్రమాదానికి బాధ్యులుగా చేస్తూ ఎల్ జి పొలిమెర్స్ లో సీనియర్ మేనేజర్ లను ప్రాసిక్యూట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖలో భారీ ప్రమాదం…!

అదేవిధంగా పరిశ్రమ విస్తరణకు అనుమతి ఇస్తూ, తెరవడానికి అనుమతి ఇచ్చిన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, పారిశ్రామిక భద్రతా విభాగం అధికారులను కూడా బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు.

ఎవ్వరు అధికారంలో ఉన్నప్పటికీ ఈ దక్షిణ కొరియా కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదని శర్మ విమర్శించారు. వందల కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, ప్రభుత్వాన్ని వివాదంలోకి లాగిన ఈ కంపెనీకి 2019 ప్రారంభంలో విస్తరణ అనుమతి యెట్లా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌ పై జగన్ కు ప్రధాని ఫోన్

రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి గాని అనుమతి లేకుండానే కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇచ్చిన్నట్లున్నదని ఆయన ఆరోపించారు. అత్యంత కాలుష్యం విరజిమ్మే ఈ పరిశ్రమకు ప్రజల నివాసాలకు మధ్యలో ఏ విధంగా అనుమతి ఇచ్చారని శర్మ ప్రశ్నించారు.

విశాఖలోనే ఇది మొదటి పారిశ్రామిక ప్రమాదం కాదని, ఈ ప్రాంతంలో 30 నుండి 40 వరకు జరిగాయని అంటూ వాటిల్లో అనేకమంది కార్మికులు, పౌరులు జీవితాలను కోల్పోయినా ఏ కంపెనీని గాని, రాష్ట్ర ప్రభుత్వ అధికారిని గాని ఇప్పటి వరకు ప్రాసిక్యూట్ చేయలేదని శర్మ విమర్శించారు.

జగన్ విశాఖ ప్రయాణం!

అధికారులు, కాలుష్య పరిశ్రమ అధిపతులు కుమ్మక్కవుతున్నారని అంటూ వారికి రాజకీయ ప్రాపకం కూడా లభించి ఉండవచ్చని పేర్కొన్నారు. కాలుష్యం శరీర రోగనిరోధక శక్తిని హరించివేసి కరోనా వంటి వైరస్ లు సోకడానికి కారణం అవుతుందని గుర్తు చేస్తూ, ప్రస్తుత తరుణంలో ఈ కాలుష్య పరిశ్రమకు ఎవ్వరు, ఏ విధంగా అనుమతి ఇచ్చారని శర్మ ప్రశ్నించారు.