Pawan Kalyan: సామాజిక రుగ్మతలను నియంత్రించాలి.. సమాజంలో మార్పులు రావాలి…మనిషి స్వేచ్ఛగా జీవించాలి…కుల మత వర్గ విభేదాలు లేని సమాజం చూడాలి..అదే జనసేన అంతిమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను పదవుల కోసం రాలేదని.. సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని నొక్కి ఒక్కానించి చెప్పారు. కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా 179 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రూ.1.79 కోట్లు అందించారు. ఈ సందర్భంగా సిద్ధవటంలో జరిగిన బహిరంగ సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం చేశారు. అందరిలోనూ ఆలోచింపజేశారు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు..కానీ మార్పు తీసుకు రావాలన్నదే తన ఆరాటంగా చెప్పుకొచ్చారు. కుల, మత, వర్గ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.వారసత్వ రాజకీయాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయలేమని.. కొత్తవారిని రాజకీయాలపైకి తెచ్చేందుకు మాత్రం తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ వరకే సుపరిచితమైందని..కానీ రాయలసీమ అంటే రత్నాల సీమగా అభివర్ణించారు.కొండల మధ్య ఉన్న సిద్ధవఠం సుందరమైందని.. ఇక్కడ నేను ఎందుకు పుట్టలేదా అని ఆలోచిస్తున్నాను అని చెప్పారు. సిద్ధులు తిరిగి పునీతమైన నేల కరువు రాజ్యమేలడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాంతంలో కరువుతో 179 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడడం కలచివేసిందన్నారు. వారి కుటుంబాలకు రూ.లక్ష నగదు ఏ మూలకూ చాలదని..కానీ వారిలో స్ఫూర్తిని నింపేందుకే జనసేన తరుపున సాయం చేస్తున్నట్టు తెలిపారు.
Also Read: CPI Supports To TRS: సూది, దబ్బుణం పార్టీలు ఇక మారవ?
ఎందరో సీఎంలు..కానీ..
రాయలసీమ ప్రాంతం ఎందరి ముఖ్యమంత్రులనో జాతికి అందించిందని..కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరూ పనికి రాలేదన్నారు. వారు బాగుపడ్డారు తప్ప..ఈ ప్రాంతాన్ని బాగుచేసిన దాఖలాలు లేవన్నారు. ఏపీలో కుల పిచ్చి అధికమైందన్నారు. కులాల మధ్య మంట రగిల్చి చలి కాగుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఒక కుల సమూహంగా భావిస్తానని.,నేనెప్పుడూ కులం గురించి మాట్లాడలేదన్నారు. భవిష్యత్ లో కూడా మాట్లాడనన్నారు. తనకు కుల వ్యమోహం కూడా లేదన్నారు. తన కులాన్ని అభిమానించిన వరకూ పర్వాలేదు..కానీ ఎదుటి కులాలను ద్వేషించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ఏలుబడిలో రెడ్డి సామాజికవర్గానికి మేలు జరుగుతోందన్న నానుడి ఉందని..కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వ బాధిత జాబితాలో ఎక్కువగా రెడ్డి సామాజికవర్గం వారే ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
Also Read: Chandrababu- Pawan Kalyan: పవన్ కు మద్దతుగా చంద్రబాబు.. పొత్తు పొడిచినట్టేనా?
పద్యం పుట్టిన నేలలో మద్యం..
పద్యం పుట్టిన నేలలో మద్యం ఏరులై పారుతోందని.. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్దిని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. అసలు నాకు జగన్ పేరు ఎత్తడానికే ఇష్టం ఉండదన్నారు. జగన్ వైసీపీకి మాత్రమే సీఎం అని.. ఈ రాష్ట్రానికి కాదన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు పౌరులు కాదా అని ప్రశ్నించారు. వారికి ఎందుకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని నిలదీశారు. గుర్తింపు కార్డులు ఇచ్చి ఉంటే ఈనాడు వారి పరిస్థితి ఇంతలా దిగజారి ఉండేదా అని ప్రశ్నించారు. సాగు గిట్టుబాటుకాక.. ప్రభుత్వం భరోసా కరువై బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. మీరే సాయం చేసి ఉంటే జనసేన ఈ గురుతర బాధ్య తీసుకునేదా అని ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు.
Also Read: Munugode Bypoll: మునుగోడు మరో హుజురాబాద్ :కట్టలు తెంచుకుంటున్న పంపకాలు
ఉద్యోగాల జాడలేదు..
రాష్ట్రంలో ఎందరో విద్యాధికులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పవన్ అన్నారు. మైదకూరుకు చెందిన దివ్యాంగుడు నాగేంద్రను బెదిరించడానికి వైసీపీ నేతలకు మనసు ఎలా వచ్చిందని నిలదీశారు.నాగేంద్రకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది అని పవన్ భరోసా ఇచ్చారు.ఎంబీఏ చదివిన విద్యార్థికి ఉద్యోగం దొరకని దౌర్భాగ్య స్థితో ఏపీ ఉండడం సిగ్గుచేటని పవన్ అన్నారు. కానీ తమ రాజకీయ ఉద్యోగం కోసం చెల్లి పార్టీ పెట్టిందని పరోక్షంగా జగన్ సోదరి షర్మిళ గురించి ప్రస్తావించారు. రాయలసీమ అంటే రెడ్లు కాదని..11 శాతం మంది ఉన్న మాదిగలు, 8 శాతం మంది ఉన్న మాలల గురించి పట్టించుకోవాలన్నారు. రెడ్డి సామాజికవర్గం గురించి తక్కువ చేసే ఆలోచన తనకు లేదని.. కానీ సమాజంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తన అభిమతమన్నారు. కులం ఓట్లను అమ్మేసే నీచ రాజకీయాలు తనవి కాదని..జనసేన ఎప్పుడూ ప్రజల పక్షమేనని గుర్తించి ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.