వాళ్ళ తాట తీసేదాకా నిమ్మగడ్డ రమేష్ ఊరుకునేలా లేడు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 30వ తేదీన మళ్లీ తన పోస్టులో గవర్నర్ చేత నియమితులయ్యారు. దానికి ముందు కొద్ది నెలలు ఏపీ ప్రభుత్వం తో చాలా కష్టతరమైన యుద్ధం చేసిన రమేష్ కుమార్ కు కాంట్రవర్సీలు ఏమి కొత్తకాదు. ఇక ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కు చిరాకు తెప్పించేలా మరొక సంఘటన జరిగింది.  నిన్నటి నుండి మీడియా వర్గాలు అన్నింటిలో ఒక నోటిఫికేషన్ బాగా వైరల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో […]

Written By: Navya, Updated On : September 6, 2020 1:23 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 30వ తేదీన మళ్లీ తన పోస్టులో గవర్నర్ చేత నియమితులయ్యారు. దానికి ముందు కొద్ది నెలలు ఏపీ ప్రభుత్వం తో చాలా కష్టతరమైన యుద్ధం చేసిన రమేష్ కుమార్ కు కాంట్రవర్సీలు ఏమి కొత్తకాదు. ఇక ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కు చిరాకు తెప్పించేలా మరొక సంఘటన జరిగింది. 

నిన్నటి నుండి మీడియా వర్గాలు అన్నింటిలో ఒక నోటిఫికేషన్ బాగా వైరల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు…. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని…. అలాగే నిమ్మగడ్డ రమేష్ తక్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పినట్లుగా వార్త ప్రచారం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన నిమ్మగడ్డ రమేష్ వాటిని కొట్టి పారేశాడు. ఇవన్నీ ఫేక్ వార్తలని.. తాము ఎలాంటి షెడ్యూల్ నూ విడుదల చేయలేదని చెప్పేశారు. అయితే రమేష్ కుమార్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని… వెంటనే షెడ్యూల్ విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 

అలాగే సోషల్ మీడియా అకౌంట్ లలో ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకునేలా ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. చాలా రోజులు మనశ్శాంతి లేకుండా ఉన్న రమేష్ కుమార్ ఎట్టకేలకు శాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉన్న దశలో ఇటువంటి వార్తలు అతనికి మళ్లీ ఒక్కసారిగా చిర్రెత్తించాయి అనే చెప్పాలి. 

ఇక ఆ ఫేక్ షెడ్యూల్ విషయానికి వస్తే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 9న మొదలై సెప్టెంబర్ 11 కి పూర్తవుతుందని…. పోలింగ్ సెప్టెంబర్ 21న జరిగితే…. సెప్టెంబర్ 24న కౌంటింగ్ ఉంటుందని వార్త వచ్చింది. అలాగే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరుగుతుందని ఇక పోలింగ్ సెప్టెంబర్ 23న జరగనుండగా…. సెప్టెంబర్ 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది అని అందులో ఉంది.