https://oktelugu.com/

థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?  

కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. నాటి నుంచి లాక్, అన్ లాక్ పేరిట కొన్నింటికి నిబంధనలు.. మరికొన్నింటికి సడలింపులిస్తూ పోయింది. అయితే కొన్నిరంగాలకు కేంద్రం ఇంకా మినహాయింపులు ఇవ్వలేదు. ప్రధానంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, సినిమా షూటింగులు ఈ కోవలోకి వచ్చాయి. ఈ రంగాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకేచోటే చేరే అవకాశం ఉండటంతో వీటికి ఇప్పటివరకు మినహాయింపు దక్కలేదు. ఇటీవలే కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని.. షూటింగులకు కేంద్ర, […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 1:19 pm
    cinema theaters

    cinema theaters

    Follow us on

    cinema theaters
    కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. నాటి నుంచి లాక్, అన్ లాక్ పేరిట కొన్నింటికి నిబంధనలు.. మరికొన్నింటికి సడలింపులిస్తూ పోయింది. అయితే కొన్నిరంగాలకు కేంద్రం ఇంకా మినహాయింపులు ఇవ్వలేదు. ప్రధానంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, సినిమా షూటింగులు ఈ కోవలోకి వచ్చాయి. ఈ రంగాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకేచోటే చేరే అవకాశం ఉండటంతో వీటికి ఇప్పటివరకు మినహాయింపు దక్కలేదు. ఇటీవలే కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని.. షూటింగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి

    Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

    అయితే థియేటర్ల ఓపెనింగులను మాత్రం కేంద్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ లో పెడుతూ వస్తోంది. ఇక థియేటర్లు ఓపెన్ అవుతాయని అనుకునే సమయానికి మళ్లీ మళ్లీ వాయిదావేస్తూ పోతుంది. దీంతో థియేటర్లను నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు నెలల తరబడి ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. థియేటర్ల మూసివేతతో ఇప్పటికే ఓటీటీ, టీవీరంగాలు దూసుకెళుతున్నాయి. సినీ ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడుతున్న తరుణంలో థియేటర్లు ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలు రెడీ చేస్తోంది.

    దీనిలో భాగంగా అన్ లాక్ 5.0 థియేటర్ల భవిష్యత్ పై కేంద్రం చర్చించేందుకు సిద్ధం అవుతుంది. ఈమేకు ఈనెల 8న కేంద్ర హోంశాఖ అధికారులు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, థియేటర్ల యూనియన్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ లో చర్చించనున్నారట. థియేటర్లు.. మల్టీఫ్లెక్స్ ల భవితవ్యంపై చర్చించి సమష్టిగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో థియేటర్లు ఏ రోజు నుంచి ఓపెన్ చేయబోతున్నారనేది ప్రకటించబోతున్నారట .

    Also Read: కరోనాకి దూరంగా ‘పుష్ప’ ప్రత్యేక జాగ్రత్తలు !

    దీంతోపాటు కుదేలైన ఈ రంగాన్ని ఎలా ఆదుకోవాలి? ఎలాంటి ప్రోత్సాహాలు అందించాలనేది చర్చించనున్నారు. టిక్కెట్టు ధరలు తగ్గించి ఆదుకోవాలని థియేటర్ యాజమాన్యాలు కేంద్రాన్ని కోరానున్నాయి. థియేటర్లు నడిపే సమయంలో కరోనా నిబంధనలు పాటించడం సాధ్యమయ్యేనా? వంటి వాటిపై చర్చించి మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఇక థియేటర్లు ఓపెన్ చేస్తే ఏమేరకు ప్రేక్షకులు వస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రం థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.