YS Sharmila: షర్మిల పార్టీ.. నెగెటివ్ ప్రయార్టీనా?

తెలుగు మీడియా అనుకుంటే దేన్నయినా హైలెట్ చేస్తారు. కాదంటే నీరు గారుస్తారు. వారు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేస్తారు. లేదంటే బమ్మిని తిమ్మి చేస్తారని తెలుసు. షర్మిల పార్టీకి మొదట్లో ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు ఇవ్వడం లేదు. మొన్నటి వరకు ఆకాశానికెత్తేసి ప్రస్తుతం కవరేజ్ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూ ప్రేయార్టీ ఇవ్వడం లేదు. దీని వెనుక ఏవో కారణాలు ఉన్నాయని లోకం కోడై కూస్తోంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ […]

Written By: Srinivas, Updated On : September 7, 2021 8:39 pm
Follow us on

తెలుగు మీడియా అనుకుంటే దేన్నయినా హైలెట్ చేస్తారు. కాదంటే నీరు గారుస్తారు. వారు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేస్తారు. లేదంటే బమ్మిని తిమ్మి చేస్తారని తెలుసు. షర్మిల పార్టీకి మొదట్లో ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు ఇవ్వడం లేదు. మొన్నటి వరకు ఆకాశానికెత్తేసి ప్రస్తుతం కవరేజ్ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూ ప్రేయార్టీ ఇవ్వడం లేదు. దీని వెనుక ఏవో కారణాలు ఉన్నాయని లోకం కోడై కూస్తోంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది.

షర్మిల పార్టీ పెట్టిన కొత్తలో పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రసారం చేశారు. ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత ఇచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్నవంటి వారికి ఇవ్వని విలువ ఆమెకు ఇచ్చి ఎంతో ఎత్తుకు లేపారు. షర్మిల పార్టీ పెట్టినప్పుడు కవరేజ్ విషయంలో తెగ హడావిడి చేసిన మీడియా పథకం ప్రకారమే ఇలా చేస్తోందని తెలుస్తోంది. అయితే మీడియాకు కల్పవృక్షంగా మారిందని సమాచారం. షర్మిల పార్టీ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందని చర్చలు నిర్వహించారు.

ప్రస్తుతం షర్మిల పార్టీపై మీడియాలో వరుసగా నెగెటివ్ కథనాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఆకాశానికెత్తిన చానళ్లే ఇప్పుడు ఇలా చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. తెలంగాణ లో ఆవిడ పార్టీపై పెద్దగా ఆసక్తి లేకపోయినా పాజిటివ్ కథనాలను రంగరించి బాగా ప్రచారం చేసి ఇప్పుడు నెగెటివ్ వార్తలు ప్రసారం చేయడంతో ఆమె పార్టీ అగాధంలో పడిపోయినట్టు తెలుస్తోంది.

అయితే షర్మిల పార్టీకి తగిన ప్రచారం లేకపోవడంతో ఆ కల్పవృక్షం ఇప్పుడు మూగబోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట్లో వచ్చిన స్పందన ఇప్పుడు రావడం లేదని తెలుస్తోంది. షర్మిల పార్టీకి నూకలు చెల్లిపోయాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో షర్మిల పార్టీకి ఊహించినంత స్పందన రావడం లేదని సమాచారం. ఇప్పుడు రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి.